యోగాలో శక్తివంతమైన ఆసనాలు ఏవంటే..!


యోగ శరీరాన్ని దృఢంగా మారుస్తుంది. యోగాలో చాలా రకాల ఆసనాలు ఉంటాయి. వాటిలో కొన్ని చాలా శక్తివంతమైనవి కూడా ఉన్నాయి.  యోగాలో శక్తివంతమైన (Powerful) ఆసనాలు  శరీరానికి శక్తిని, స్థిరతను, సౌష్టవాన్ని, ధైర్యాన్ని ఇచ్చే ఆసనాలు. ఇవి శారీరకంగా గట్టిగా ఉండటంతో పాటు మానసిక శాంతిని కూడా అందిస్తాయి. ఇవి శక్తి, సహనం, స్తైర్యం, ఫోకస్, ప్రాణశక్తి పెంచే విధంగా పనిచేస్తాయి. అలాంటి శక్తివంతమైన యోగాసనాలు ఏవో తెలుసుకుంటే..

శక్తివంతమైన యోగాసనాలు..

వీరభద్రాసనాలు..  

వీరభద్రాసనాలలో మూడు రకాలు ఉన్నాయి.   ఇవి వేస్తుంటే శరీరానికి ధైర్యం, స్థైర్యం కలుగుతుంది. కాళ్ళు, చేతులు, వెన్నెముక బలపడతాయి. మనస్సు కేంద్రీకృతం అవుతుంది.

 నౌకాసన (Boat Pose)..

నౌకాసనం వస్తుంటే శరీరంలో మధ్య భాగం (core) శక్తివంతంగా తయారవుతుంది. అబ్డోమినల్ మసిల్స్, స్పైన్ బలపడతాయి. మానసిక దృఢత పెరుగుతుంది.

బకాసన (Crow Pose)..

బలమైన చేతులు, మోకాలుకు సపోర్ట్ కావాలంటే బకాసన వేయడం చాలా మంచిది. ఈ ఆసనం వేయడం వల్ల  ఫోకస్, సమతుల్యత అభివృద్ధి చేస్తుంది.  ధైర్యాన్ని పెంచుతుంది.

 ఉర్ధ్వ ధనురాసనం (Upward Bow or Wheel Pose)..

ఊర్థ్వ ధనురాసనం వేస్తే వెన్నెముక, గుండె, ఛాతీ తెరుచుకుంటాయి. ఇది  శక్తిని పంచుతుంది, ఉత్సాహం పెంచుతుంది.

పరివ్రుత్త పర్వతాసన (Revolved Triangle Pose )

పరివృత్త పర్వతాసన వేయడం ద్వారా శరీరానికి లవణత (flexibility),  బలం ఇస్తుంది. జీర్ణ వ్యవస్థ మెరుగవుతుంది. శరీరాన్ని డిటాక్స్  చేయడంలో సహాయం చేస్తుంది.

 అధో ముఖ శ్వానాసన (Downward Facing Dog)..

అధోముఖ శ్వానాస వేయడం వల్ల శరీరంలోని అన్ని భాగాలపై ప్రభావం పడుతుంది.  ఇది శక్తిని పునరుత్తేజితం చేస్తుంది. మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది.

చతురంగ దండాసన (Low Plank)..

చేతులు, భుజాలు, మధ్య భాగం బలంగా తయారవుతాయి. శక్తిని కేంద్రీకరించేందుకు ఉపయుక్తంగా ఉంటుంది.

ప్రాణాయామం తో కలిపితే..

శక్తివంతమైన ఆసనాలకు ప్రాణాయామం (విశేషంగా కపాలభాతి, బస్ట్రికా) తోడైతే శక్తి స్థాయి మరింత పెరుగుతుంది.

సూచనలు:
ఆసనాలు సాధన చేయడానికి ముందుగా మైల్డ్ వార్మప్ చేయాలి.

శ్వాసపై దృష్టి పెట్టడం ముఖ్యం.

మొదట్లో శిక్షణ పొందిన గురువు సూచనతో చేయడం ఉత్తమం.

                                        *రూపశ్రీ.


గమనిక:
ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...

 

Related Segment News