ఏ ఉప్పు ఆరోగ్యానికి మంచిది? ఆయుర్వేదంలో దీని గురించి ఏం చెప్పారంటే..!

posted on: Jun 20, 2025 9:30AM



ఉప్పు లేని వంటను ఊహించలేం, అలాగే ఉప్పు లేకుండా ఏమీ తినలేం.  చాలామంది పలుచటి మజ్జిగ తాగాలన్నా సరే.. అందులో కాసింత ఉప్పు వేసుకుని తాగుతుంటారు.  ఉప్పు ఆరోగ్యానికి మంచిదే కానీ సరైన విధంగా ఉప్పు తీసుకోకపోతే అది ఆరోగ్యానికి చేటు కూడా చేస్తుంది. అదేవిధంగా ఉప్పులో రకాలు కూడా ఉంటాయి.  ఏ ఉప్పు ఆరోగ్యానికి మంచిది అనే విషయం ఈ మధ్యకాలంలో చాలా హాట్ టాపిక్ గా మారింది.  ఆయుర్వేదంలో ఆరోగ్యానికి ఏ ఉప్పు మంచిది అనే విషయం స్పష్టంగా ఇవ్వబడింది.  దీని గురించి తెలుసుకుంటే..

ఆయుర్వేదంలో సాధారణంగా "సెంధా నమక్" లేదా "సైంధవ లవణం" ఆరోగ్యానికి అత్యుత్తమమైన ఉప్పుగా పరిగణించబడుతుంది. ఇది హిమాలయ ప్రాంతాల్లో దొరికే సహజ  ఉప్పు. దీనిని ఆంగ్లంలో Himalayan Rock Salt లేదా Pink Salt అని కూడా అంటారు.

ఆయుర్వేద దృష్టిలో సైంధవ లవణం విశిష్టత:
ఆయుర్వేద గ్రంథాలలో ఆరు రకాల లవణాలు (ఉప్పులు) గురించి చెప్పబడింది. వాటిలో సైంధవ  లవణం ఉత్తమంగా భావించబడుతుంది.

 సైంధవ లవణం  యొక్క ఆరోగ్య ప్రయోజనాలు..

త్రిదోష సమతుల్యత..

వాత, పిత్త, కఫ దోషాలను సమతుల్యంలో ఉంచుతుంది. ముఖ్యంగా వాత దోషాన్ని తగ్గించడంలో ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.

జీర్ణవ్యవస్థకు సహాయపడుతుంది..

అజీర్ణం, ఉబ్బసం, గ్యాస్ వంటి సమస్యలను నివారించడంలో ఉపయోగపడుతుంది. అపానవాయువు నియంత్రణకు ఉపయోగకరమైందిగా భావిస్తారు.

అల్కలైనిటి మేనేజ్‌మెంట్..

శరీరంలో పిహెచ్ స్థాయిని సద్దుమణిగించే లక్షణం కలిగి ఉంటుంది. అమ్లత్వాన్ని తగ్గించి దాహాన్ని నివారిస్తుంది.

హృదయ ఆరోగ్యం..

రక్తపోటు నియంత్రణకు సహాయపడుతుందని చెబుతారు. అయితే దీన్ని అత్యధికంగా తీసుకోకూడదు. సోడియం కంటెంట్ తక్కువగా ఉండటం వల్ల హై బీపీ ఉన్నవారు సాధారణ ఉప్పు కంటే దీనిని కొంతమేరకు ఉపయోగించవచ్చు.

చర్మ సమస్యలు..

సైంధవ  ఉప్పుతో స్నానం చేస్తే చర్మ వ్యాధులు, అలర్జీలు తగ్గుతాయని నమ్మకం ఉంది.

గర్భిణీ స్త్రీలకు అనుకూలం:

సాధారణ ఉప్పు కాకుండా సైంధవ లవణంను  ఉపవాసాల సమయంలో, గర్భధారణ సమయంలో ఉపయోగిస్తారు ఎందుకంటే ఇది శరీరానికి మృదుత్వం ఇస్తుంది.

ఇవి తెలుసుకోండి..

ఆయుర్వేద ప్రకారం ఇది అధికంగా వాడితే కఫ, పిత్తాన్ని పెంచే అవకాశం ఉంది. శరీరానికి అధిక ఉష్ణతనివ్వడం, రక్తాన్ని కలుషితం చేయడం వంటి సమస్యలు తలెత్తవచ్చు.

సముద్ర ఉప్పు..

ఇది కూడా కొన్ని సందర్భాల్లో వాడతారు కానీ ఇది ఎక్కువగా కఫ, పిత్తాన్ని ప్రేరేపించగలదని భావిస్తారు.

ఉపయోగించే విధానం..

రోజువారీ వంటల్లో సాధారణ ఉప్పు స్థానంలో తక్కువ మోతాదులో సైంధవ లవణం వాడడం ఆరోగ్యానికి మేలు చేస్తుంది. చట్నీలు, రైతాలు, ఉపవాసకాల వంటల్లో ఇది వాడతారు.

స్నాన జలంలో ఈ ఉప్పును కలిపి వాడితే శరీరానికి విశ్రాంతి కలుగుతుంది.

                        *రూపశ్రీ

గమనిక:
ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...

 

google-ad-img
    Related Sigment News
    • Loading...