వాల్నట్స్ తింటే ఈ ప్రయోజనాలు అన్నీ మీ సొంతం..!


 

బాదం, జీడిపప్పు లాగా వాల్నట్స్ ను కూడా చాలామంది డ్రై ఫ్రూట్ గా తింటారు.  ఇవి ధర కాస్త ఎక్కువే కానీ ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు.  మెదడు ఆకారాన్ని పోలి ఉండే ఈ వాల్నట్స్ ను రెగ్యులర్ గా డైట్ లో భాగం చేసుకుంటే అద్బుతమైన ప్రయోజనాలు ఉంటాయి. సాధారణంగా ఎండు వాల్నట్స్ మాత్రమే ఎక్కువ అందుబాటులో ఉంటాయి. కానీ నిజానికి వాల్నట్స్ ను పచ్చిగా ఉండగానే తింటే దాదాపు వెనీలా సువాసనతో చాలా రుచిగా ఉంటాయి.  అసలు వాల్నట్స్ తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో తెలుసుకుంటే..

బ్రెయిన్ పవర్..

చూడ్డానికి అచ్చం మెదడు ఆకారాన్ని, మెదడుకు ఉన్న మలుపులను పోలి ఉండే వాల్నట్స్ తింటే బ్రెయిన్ పవర్ పెరుగుతుంది. వాల్నట్స్ లో ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు ఉంటాయి.  ఇవి జ్ఞాపకశక్తిని,  ఆలోచనా సామర్థ్యాన్ని పెంచుతాయి. మెదడు ఆరోగ్యం మెరుగ్గా ఉండటానికి వాల్నట్స్ బాగా సహాయపడతాయి.

గుండె ఆరోగ్యం..

వాల్నట్స్ లో ఉండే ఒమేగా-3 ప్యాటీ కొవ్వులు ఆరోగ్యకరమైన కొవ్వుల జాబితాకు చెందినవి.  ఇవి గుండెకు చాలా అవసరం.  గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ఇవి సహాయపడతాయి.  ముఖ్యంగా ఆరోగ్యకరమైన కొవ్వులు శరీరానికి అందుతూ ఉంటే.. శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ కూడా నెమ్మదిగా తగ్గుతుంది.  అంటే.. వాల్నట్స్ తింటే చెడు కొవ్వులను కూడా తగ్గించుకోవచ్చు.

ఫైబర్, ప్రోటీన్..

వాల్నట్స్ లో ఫైబర్, ప్రోటీన్ పుష్కలంగా ఉంటాయి.  ఇవి బరువు తగ్గడానికి సహాయపడతాయి. వీటిని తినడం వల్ల ఎక్కువ సేపు కడుపు నిండిన ఫీల్ ఇస్తుంది. పదే పదే ఆకలి కావడం,  ఎక్కువగా తినడాన్ని నివారించడంలో సహాయపడుతుంది. తద్వారా బరువు కూడా తగ్గవచ్చు.

జీర్ణక్రియ..

వాల్నట్స్ లో మంచి మొత్తంలో ఫైబర్ ఉంటుంది.  ఇది జీర్మవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. మలబద్దకం వంటి సమస్యలను తొలగించడంలో సహాయపడుతుంది.

బోన్ స్ట్రెంత్..

వాల్నట్స్ లో కాల్షియంతో పాటు ఇతర ఖనిజాలు కూడా ఉంటాయి.  ఇవి ఎముకలను బలోపేతం చేయడంలో సహాయపడతాయి. ఎముకలు ఆరోగ్యంగా ఉండటంలో కూడా సహాయపడతాయి.

మానసిక ఆరోగ్యం..

వాల్నట్స్ లో ఉండే సమ్మేళనాలు మానసిక స్థితిని మెరుగుపరచడంలో అద్భుతంగా సహాయపడతాయి.  ఇవి మెదడు ఆరోగ్యాన్ని సంరక్షిస్తాయి కాబట్టి మానసిక ఆరోగ్యాన్ని కూడా మెరుగ్గా ఉంచుతాయి.  చిరాకు, అసహనం,  ఒత్తిడి వంటి వాటిని అదుపులో ఉంచుకునే దిశగా మెదడుకు ఓదార్పును ఇస్తాయి. హ్యాపీ హార్మోన్స్ ఉత్పత్తిలో సహాయపడుతుంది.

నిద్ర..

వాల్నట్స్ లో మెలటోనిన్ అనే పదార్థం ఉంటుంది.  ఇది నిద్ర నాణ్యతను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. సాయంత్రం వాల్నట్స్ తింటే రాత్రి సమయంలో హాయిగా నిద్రపోవచ్చు.

ఇమ్యూనిటీ..

వాల్నట్స్ లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.  ఇవి శరీరంలో హానికరమైన కణాలతో పోరాడి శరీరాన్ని వ్యాధుల బారి నుండి రక్షిస్తాయి.

                          *రూపశ్రీ.


గమనిక:
ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...