నన్ను ఒక్కదాన్నే టార్గెట్ చేస్తున్నారా.. స్మితా సబర్వాల్ రియాక్షన్

 

హెచ్సీయూ కంచ గచ్చిబౌలి 400 ఎకరాల భూమిపై రీట్వీట్ చేసిన కేసులో విచారణకు  సీనియర్ ఐఏఎస్ పర్యాటక శాఖ ముఖ్య కార్యదర్శి స్మితా సబర్వాల్ హాజరయ్యారు. ఈ పోస్ట్‌ను 2000 మంది కూడా  రీట్వీట్ చేశారని మరి వారి మీద కూడా చర్యలు ఉంటాయా లేదా నన్ను ఒక్కదాన్నే టార్గెట్ చేస్తున్నారా అని అడిగారు. చట్టం అందరికీ సమానంగా వర్తిస్తుందా లేక ఈ విషయంలో కొందరిని మాత్రమే ఎంపిక చేసి వారినే టార్గెట్ చేస్తున్నారా అని పోలీసులను నిలదీశారు. తనకు పంపినట్లే మిగతా 2 వేలమందికి కూడా నోటీసులు పంపించారా..? అని నిలదీశారు. వారందరిపైనా ఇలాంటి చర్యలే తీసుకున్నారా అని అడిగారు. కాగా, కంచ గచ్చిబౌలి భూములకు సంబంధించి ఫేక్ ప్రచారంపై రేవంత్ సర్కార్ సీరియస్ గా చర్యలు చేపట్టింది. మార్ఫ్ డ్ ఏఐ ఫొటోలను పోస్టు చేసిన వారిపై కేసులు నమోదు చేస్తోంది. ఈ నోటీసులపై ఆమె తాజాగా ఎక్స్‌ వేదికగా స్పందించారు. పోలీసులకు పూర్తిగా సహకరించినట్లు చెబుతూ.. చట్టాన్ని గౌరవించే వ్యక్తిగా పోలీసులు అడిగిన ప్రశ్నలకు వివరణ ఇచ్చినట్లు వెల్లడించారు. 

తాను రీపోస్టు చేసినట్లే రెండు వేల మంది చేశారని.. వాళ్లందరిపైనా ఇలాంటి చర్య తీసుకుంటున్నారా..? అని ప్రశ్నించినట్లు తెలిపారు. చట్టం అందరికీ సమానమా.. ? ఎంపిక చేసిన వారినే టార్గెట్‌ చేస్తున్నారా..? అని స్మితా సభర్వాల్‌ నిలదీశారు. హాయ్ హైదారాబాద్’ అనే ట్విట్టర్ యూజర్ ఓ ఏఐ ఫొటోను ట్వీట్ చేయగా.. ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ రీట్వీట్ చేశారు. ఈ వ్యవహారంపై గచ్చిబౌలి పోలీసులు ఆమెకు నోటీసులు పంపించి విచారణకు పిలిచారు. తొలుత ఈ నోటీసులకు స్పందించని స్మితా సబర్వాల్.. ఆ తర్వాత ప్రభుత్వానికి వ్యతిరేకంగా మరిన్ని ట్వీట్లు చేశారు. తాజాగా శనివారం ఈ వివాదంపై స్మితా సబర్వాల్ స్పందించారు. గచ్చిబౌలి పోలీసులు పంపిన నోటీసులకు తాను జవాబిచ్చినట్లు తెలిపారు. చట్టాన్ని గౌరవించే వ్యక్తిగా పోలీసులు అడిగిన ప్రశ్నలకు వివరణ ఇచ్చినట్లు పేర్కొన్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సహా పలువురు తమ ట్వీట్లను తొలగించారు. అయితే, స్మితా సబర్వాల్ మాత్రం వెనక్కి తగ్గకపోగా కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మరిన్ని పోస్టులు చేస్తున్నారు. పోలీసుల నోటీసులు అందుకున్నా ఆమె దూకుడు తగ్గించుకోలేదు. సుప్రీంకోర్టు తీర్పులకు సంబంధించిన వార్తా కథనాలను వరుసగా ట్వీట్ చేశారు.