ఏపీలో రేషన్ వ్యాన్ల రద్దు : మంత్రి నాదెండ్ల
posted on May 20, 2025 8:43PM

ఆంధ్రప్రదేశ్‌లో జూన్ ఒకటో తేదీ నుంచి చౌకధర దకాణాల ద్వారానే రేషన్ సరఫరా చేస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. 65 ఏళ్లు పైబడిన వృద్ధులకు దివ్యాంగులకు మాత్రం డోర్ డెలివరీ చేస్తాని మంత్రి నాదెండ్ల పేర్కొన్నారు. 29వేల చౌక దుకాణాల ద్వారా గతంలో బియ్యం సహా ఇతర సరకుల సరఫరా జరిగేది. గత వైసీపీ సర్కార్ ఎండీయూల పేరిట ఈ వ్యవస్థను నాశనం చేసింది. 9,260 మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్‌ల కోసం రూ.1860 కోట్లు వృథా చేశారు. లబ్ధిదారులు తమ ఇబ్బందులను ఎవరికీ చెప్పుకోలేక పోయారు. 30శాతం మందికి రేషన్ అందడం లేదని ఐవీఆర్‌ఎస్ సర్వేలో తేలింది. రేషన్ సరఫరాకు వాహనాలు వచ్చాక జవాబుదారీ తనం లేదు, సరకులు ఎటు వెళ్తున్నాయో తెలియదు.
వందల సంఖ్యలో క్రిమినల్ కేసులు ఈ వాహనాల ఆపరేటర్‌లపై నమోదయ్యాయి. పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా కోసం ఓ గ్రీన్ ఛానెల్ ఏర్పాటు చేసుకున్నారు. చౌకదుకాణాలు ప్రతినెల 1 నుంచి 15వ తేదీ వరకు అందుబాటులో ఉంటాయి. పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా పై ఉక్కుపాదం మోపుతాం అని మంత్రి నాదెండ్ల తేల్చి చెప్పారు. రేషన్ సరఫరాకు వాహనాలు వచ్చాకా సరుకులు ఎటు వెళుతున్నాయో తెలియలేదు. ఒక్కో వాహనానికి నెలకు రూ.27వేల చొప్పున పౌర సరఫరా శాఖ చెల్లిస్తోందని పేర్కొన్నారు. చాలా అంశాలపై నిర్ణయించి రేషన్ వ్యాన్లను రద్దు నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి తెలిపారు. దీపం-2 పథకం పై మంత్రివర్గ సమావేశంలో చర్చించామని.. దీపం-2 కింద బుకింగ్ కు ముందే లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేస్తామని మంత్రి నాదెండ్ల తెలిపారు.