హర్యానా మాజీ ముఖ్యమంత్రి ఓం ప్రకాశ్ చౌతాలా కన్నుమూత

ఇండియన్ నేషనల్ లోక్ దళ్ అధినేత  హర్యానా మాజీ ముఖ్యమంత్రి ఓం ప్రకాశ్ చౌతాలా కన్నుమూశారు. హర్యానా రాష్రానికి ఐదు సార్లు సీఎంగా సేవలందించిన నాయకుడు ఓం ప్రకాశ్ చౌతాలా శుక్రవారం (డిసెంబర్ 20) మధ్యాహ్నం కార్డియాక్ అరెస్ట్ తో తుదిశ్వాస విడిచారు.

 గురుగ్రావ్ లోని తన నివాసంలో కార్డియాక్ అరెస్ట్ తో చౌతాలా చనిపోయారని ఐఎన్ఎల్ డీ వర్గాలు తెలిపాయి. చౌతాలా వయసు 89 ఏళ్లు.  హర్యానా రాజకీయాల్లో చౌతాలా తనదైన ప్రత్యేక ముద్ర వేశారు.   1989 నుంచి 2005 వరకు హర్యానాకు ఐదుసార్లు సీఎంగా చౌతాలా సేవలందించారు. వృద్ధాప్యం కారణంగా చౌతాలా కొంతకాలంగా రాజకీయాల్లో ఇన్ యాక్టివ్ అయ్యారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu