హరికృష్ణ కొత్త పార్టీ..!!

 

 Harikrishna new party, Harikrishna tdp, tdp Harikrishna new party

 

 

టిడిపి పార్టీ ఎంపీ హరికృష్ణ, రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన తన రాజీనామా లేఖను రాజ్యసభ చైర్మన్ హమీద్ అన్సారీకి అందజేశారు. అయితే హరికృష్ణ రాజీనామా పైన వివిధ రకాల ప్రచారం జరుగుతోంది.  సిడబ్ల్యూసి విభజన నిర్ణయం వెలువడిన హరికృష్ణ మొదట రాజీనామా చేస్తూ... ప్రజల సెంటిమెంటుకు తలవంచి తాను విభజనను అంగీకరిస్తున్నానన అయితే, విభజన తీరు బాగాలేదని ఆయన ఆక్షేపించారు. ఈసారి సమైక్యాంద్రకు మద్దతుగా ఆయన రాజీనామా చేశారు.

 

హరికృష్ణ రాజీనామాలో మరో కోణాలు కూడా ఉండి ఉండవచ్చునని ప్రచారం సాగుతోంది. చంద్రబాబుపై నిత్యం అసంతృప్తి వ్యక్తం చేసే హరికృష్ణ...సీమాంధ్రలో కొత్త పార్టీ పెట్టే ఉద్దేశ్యంతో ఉన్నారని అందుకే, రాజీనామా చేశారని అంటున్నారు. ఇప్పుడు ఎంపీ పదవికి రాజీనామా చేసిన హరికృష్ణ ..త్వరలో కృష్ణా జిల్లా చైతన్య యాత్ర ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. సమైఖ్య నినాదంతో యాత్ర చేయబోతున్న హరికృష్ణ తెలుగుదేశం పార్టీకి కూడా రాజీనామా చేస్తారని వార్తలు వినిపిస్తున్నాయి.     



అయితే జూనియర్ ఎన్టీఆర్ కారణంగా పార్టీ వైపు ఆలోచించే అవకాశాలు లేకపోలేదని మరికొందరు అంటున్నారు. మొత్తం మీద ఆయన టిడిపి కి రాజీనామా చేసి..బస్సు యాత్ర మొదలు పెడితే అప్పుడు కాస్త క్లారిటీ రావొచ్చు. 

 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu