డిప్యూటీ మేయర్ ఎంపిక: పిసిసికే బాధ్యత

హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ డిప్యూటీ మేయర్‌ను సీల్డ్ కవర్ ద్వారానే ఎంపిక చేస్తామని ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ ప్రకటించింది. పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణ కాంగ్రెసు కార్పోరేటర్లతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కార్పోరేటర్లంతా పిసిసి చీఫ్ బొత్సకు ఎంపిక బాధ్యతను అప్పగించారు. జనవరి మూడో తేదిన ఈ ఎంపిక ఉంటుంది. జిహెచ్ఎంసి పరిధిలోని కాంగ్రెసు పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకునేందుకు ఇద్దరు సభ్యులను నియమించారు. వీరు ప్రజాప్రతినిధులు అందర్నీ కలిసి అభ్యర్థిత్వంపై వారి నిర్ణయాలు తీసుకొని ఓ నివేదిక తయారు చేసి బొత్సకు అందజేస్తారు.

ఈ నివేదికలోని అంశాలను సిఎం కిరణ్ కుమార్ రెడ్డితో చర్చించి ఎంపికపై తుది నిర్ణయం తీసుకుంటారు. కాగా హైదరాబాద్‌కు చెందిన పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు తమ అభ్యర్థులకే డిప్యూటీ మేయర్ పదవి కట్టబెట్టాలని అడుగుతున్నారని సమాచారం. అయితే ఏడాదికి ఒకరు చొప్పున ఇద్దరు కార్పోరేటర్లకు ఆ పదవి కట్టబెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాగా ఎంఐఎంతో ఒప్పందం మేరకు వచ్చే రెండు సంవత్సరాలు మేయర్ పదవిని వారికి ఇవ్వాల్సిన నేపథ్యంలో ఇటీవల కార్తీక రెడ్డి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu