'ప్రత్యక్ష సాక్షిని నేనే'జగన్‌పై చిరు
posted on Dec 30, 2011 9:04AM
నెల్లూరు:
రాష్ట్రాన్ని దోచుకుందాం, పదవులు లాగేసుకుందామంటే కుదరదని నెల్లూరు పర్యటనలో ఉన్న కాంగ్రెసు నాయకుడు చిరంజీవి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్‌పై విరుచుకుపడ్డారు. ప్రజలే పదవులు ఇవ్వాలని ఆయన అన్నారు. తండ్రి పార్థివ శరీరం రాక ముందే కొంత మంది వద్దకు వచ్చి మద్దతివ్వాలని కోరారని, దానికి తానే ప్రత్యక్ష సాక్షిని అని ఆయన అన్నారు. నెల్లూరులో ఆయన తొలుత అభిమానుల సమావేశంలో, ఆ తర్వాత బహిరంగ సభలో మాట్లాడారు. కొంత మంది పదవుల కోసం ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన వైయస్ జగన్‌ను ఉద్దేశించి అన్నారు.చేతిలో మీడియా ఉందని చెప్పి తప్పుడు ప్రచారాలు చేస్తూ రాష్ట్రంలో పరిపాలన సజావుగా సాగకుండా అడ్డంకులు సృష్టించేందుకు కుట్ర చేస్తున్నారని ఆయన విమర్శించారు. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం ఎక్కడా ఆగలేదని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అభివృద్ధి పథకాలను ముందుకు తీసుకుని వెళ్తున్నారని ఆయన అన్నారు.