కూటమి సర్కారుకే పట్టభద్రుల మద్దతు.. 8 నెలల పాలనను దీవిస్తూ తీర్పు

సార్వత్రిక ఎన్నికల తర్వాత జరిగిన తొలి ఎన్నికల్లో  తెలుగుదేశం అభ్యర్ధులు భారీ విజయం సాధించారు. ఏపీలో అధికారం చేపట్టిన తర్వాత గ్రాడ్యుయేట్లంతా ప్రభుత్వానికి మద్ధతు ప్రకటించినట్టు ఈ విజయంతో తేలిపోయింది. ఉభయగోదావరి, కృష్ణా-గుంటూరు జిల్లాలో జరిగిన గ్రాడ్యుయేట్ స్థానాల్లో తెలుగుదేశం అభ్యర్ధులు విజయం సాధించారు. ఈ నాలుగు ఉమ్మడి జిల్లాలోని విద్యావంతులు కూటమి ప్రభుత్వానికి మద్ధతుగా నిలిచిన పరిస్ధితి కనిపిస్తోంది. ఈ ఎన్నికల్లో హైలైట్ ఏంటంటే.. 65 శాతానికి పైగా ఓట్ల మోజార్టీతో తెలుగుదేశం అభ్యర్థులు విజయం సాధించారు. నాలుగు ఉమ్మడి జిల్లాల పరిధిలో 67 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. వీటి పరిధిలోనే ఇప్పుడు ఎన్నికలు జరిగాయి. దీంతో కూటమి ప్రభుత్వ 8 నెలల పాలనకు దీవెనలా ఈ తీర్పు ఉందని చెప్పవచ్చు.  

2024 సాధారణ ఎన్నికల్లో 57 శాతం ఓట్ షేర్ సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే... నేడు అంతకు మించి 65 శాతంపైగా ఓట్ షేర్ తో ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించారు టీడీపీ అభ్యర్థులు.  ఉమ్మడి కృష్ణా-గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గానికి జరిగిన ఎన్నికల్లో కూటమి అభ్యర్థి ఆలపాటి రాజాకు లక్షా 45 వేల 57 ఓట్లు పొంది, మొత్తం ఓట్లలో 67.51 శాతం పైగా సాధించారు. 8 2 వేల 320 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఇక ఉభయగోదావరి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గానికి కూటమి తరఫున పోటీ చేసిన పేరాబత్తుల రాజశేఖర్1,24,702 ఓట్లు దక్కించుకున్నారు. ఇది మొత్తం ఓట్లలో 62 శాతం కంటే ఎక్కువ.  77 వేల 461 ఓట్ల పైన భారీ మెజారిటీతో విజయం సాధించారు.

2024 సార్వత్రిక ఎన్నికల్లో ఉభయ గోదావరి జిల్లాల్లో 59.28 శాతం ఓట్ షేర్ రాగా.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో  అది మరింత పెరిగి 62.59 శాతం ఓట్ షేర్ వచ్చింది.  ఇక కృష్ణా గుంటూరు జిల్లాల్లో సార్వత్రిక ఎన్నికల సమయంలో 58.19 శాతం ఓట్ షేర్ రాగా..  ఎమ్మెల్సీ ఎన్నికల్లో అది భారీగా పెరిగి 67.51 శాతం ఓట్ షేర్ వచ్చింది. ఇక ఓవరాల్‌గా చూస్తే ఈ నాలుగు ఉమ్మడి జిల్లాల్లో సాధారణ ఎన్నికల్లో 58 శాతం ఓట్ షేర్ రాగా... నేడు  65 శాతం ఓట్ షేర్ సాధించింది కూటమి.  తాజా గెలుపుతో మొత్తం 5 పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల్లో ఐదు కూటమే దక్కించుకుంది.

ఇప్పుడే కాదు.. 2023లో జరిగిన గ్రాడ్యుయేట్స్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లోను సత్తా చాటారు టీడీపీ అభ్యర్ధులు. అప్పుడు వైసీపీ ప్రభుత్వ హయంలో జరిగిన పట్టభద్రుల ఎన్నికల్లో కూడా టీడీపీ అభ్యర్ధులు విజయం సాధించారు. 2023లో ఉత్తరాంధ్ర గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థి వేపాడ చిరంజీవి..  ఉమ్మడి చిత్తూరు-నెల్లూరు-ప్రకాశం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా టీడీపీ అభ్యర్థి కంచర్ల శ్రీకాంత్.. కడప-కర్నూలు-అనంతపురం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా టీడీపీ అభ్యర్థి భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి ఘనవిజయం సాధించారు. ఇందులో హైలైట్ ఏంటంటే, మాజీ సీఎం జగన్ నియోజకవర్గం పులివెందుల ఉన్న పశ్చిమ రాయలసీమ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానం కూడా టీడీపీ కైవసం చేసుకోవడం. ఆ నియోజకవర్గంలోనూ భూమిరెడ్డి రాంగోపాల్‌ రెడ్డి విజయం సాధించారు. ఆ మూడు స్థానాల్లో వచ్చిన రిజల్ట్స్‌తో టీడీపీ మరింత దూకుడుగా వైసీపీ విధానాలను ఎండగడుతూ ప్రజల్లోకి వెళ్లింది.  

అప్పుడు 2023లో మూడు.... ఇప్పడు 2025లో రెండు... మొత్తం 5 పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలు టీడీపీ ఖాతాలో వేసుకుంది. దీంతో విపక్షంలో ఉన్నా.. అధికారపక్షంలో ఉన్నా.. చంద్రబాబు నాయకత్వంపై నమ్మకంతోనే టీడీపీ అభ్యర్ధులకు పట్టభద్రులు మద్దుతిచ్చారని తేలిపోయింది. చంద్రబాబు హయంలో ఉపాధి, ఉద్యోగ అవకాశలు మెరుగుపడాతయనే నమ్మకంతో గ్రాడ్యుయేట్లు ఉన్నారటానికి ఈ రిజల్స్‌ నిదర్శనంగా చేప్పుకోవచ్చు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu