మళ్లీ జగన్ కోటరీని టార్గెట్ చేసిన విజయసాయిరెడ్డి
posted on Jan 18, 2026 9:35PM
.webp)
వైసీపీకి రాజీనామా చేసిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి సోషల్ మీడియా వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో జగన్ చుట్టూ కోటరీ ఉందని వ్యాఖ్యానించిన విజయసాయిరెడ్డి.. తాజాగా అమ్ముడుపోయి కోటరీల మధ్య బందీలుగా ఉన్న ఓ ప్రజా నాయకులారా ఆలోచించుకోండని హితవు పలికారు. భవిష్యత్తులో ఏం జరగబోతోందో ఇప్పటికైనా గుర్తించాలని పేర్కొన్నారు.
వెనిజులాలో ఎంతో భారీగా ప్రజాదరణతో ఎన్నికైన తర్వాత.. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, ఇంటెలిజెన్స్ అధిపతులు ఇంతమంది చుట్టూ ఉన్నా.. ఆ దేశ అధ్యక్షుడిని, అతడి భార్యని ప్రెసిడెన్షియల్ ప్యాలెస్ నుంచి అమెరికా ఎలాంటి ప్రతిఘటనా లేకుండా ఎత్తుకుపోయిందని విజయసాయి రెడ్డి గుర్తుచేశారు. దానికి కారణం ఏంటి? వారంతా అమ్ముడుపోవటమే కదా అని ట్వీట్ చేశారు. అయితే, గతంలోనూ వైసీపీ అధ్యక్షుడు జగన్ చుట్టూ కోటరీ ఉందని.. విజయసాయిరెడ్డి బహిరంగంగానే వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఇప్పుడు జగన్‌ను ఉద్దేశించే ఆయన ఈ వ్యాఖ్యలు చేశారని పలువురు కామెంట్స్ చేస్తున్నారు.