గోదావరికి మళ్ళీ జలకళ
posted on Jul 25, 2012 4:32PM
గోదావరి చాలా నెలల తర్వాత నీటితో కళకళలాడుతోంది. ధవళేశ్వరం వద్ద గోదావరి పరుగులిడుతుంది. ఎగువ ప్రాంతాలలో వర్షాలు కురుస్తుండ టంతో నదిలోకి నీటి ప్రవాహం వచ్చి చేరింది. దీంతో 1,60,000 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడిచి పెట్టారు. ఇప్పటివరకు వర్షాభావ పరిస్థితిల్లో ఉన్న గోదావరి మూడు నాలుగు రోజుల కుంభవృష్టితో జలకళను సంతరించుకుంది. సాగు అవసరాల నిమిత్తం 10,200 క్యూసెక్కుల నీటిని డెల్టా కాల్వలకు విడుదల చేసినట్లు అధికారు తెలిపారు. మంగళవారం వరకు వరదనీటితో పోటెక్కిన గోదావరికి ఎగువ ప్రాంతాల్లో వర్షాలు ఆగిపోవడం వల్ల వరదనీరుకూడా తగ్గిందని అధికారులు చెబుతున్నారు. మంగళవారం సాయంత్రానికి ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ దగ్గర 10.60 నీటి మట్టం నమోదయ్యింది. బ్యారేజిలోని 175 క్రస్ట్ గేట్లను 0.30 మీటర్లకు ఎత్తి లక్షా అరవైవేల క్యూసెక్కుల నీటిని బంగాళాఖాతంలోకి విడిచి పెట్టారు.