కంటతడి పెట్టిన చంద్రబాబు..

 

ఈరోజు గోదావరి మహాపుష్కరాలు ప్రారంభమయ్యాయి. కానీ ప్రారంభమయిన తొలి రోజే అపశృతి జరిగింది. రాజమండ్రిలోని ఘాట్ వద్ద తోపులాట జరిగి సుమారు 27 మంది మృతి చెందారు. అయితే అనుకున్నదానికంటే ఎక్కువ మంది భక్తులు రావడంతో తోపులాట జరిగి ఈ ప్రమాదం జరిగిందని ప్రభుత్వ అధికారులు తెలుపుతున్నారు. దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు స్పదించి తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. పుష్కరాల కోసం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్న అనుకోని సంఘటన జరగడం.. ఇంత మంది మృతి చెందడం మనసు కలిచి వేస్తుందని కంటతడి పెట్టారు. ఎక్కడ లోపం ఉందో పుష్కరాలు పూర్తయ్యాక విచారణ జరిపిస్తామన్నారు. మృతి చెందిన కుటుంబాలకు పది లక్షలు ఎక్స్ గ్రేషియా ప్రకటించారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu