జనవరి 23న జి.హెచ్.ఎం.సి. ఎన్నికలు
posted on Dec 12, 2015 8:03AM
.jpg)
జి.హెచ్.ఎం.సి. ఎన్నికలకు ముహూర్తం ఖరారు అయింది. వచ్చే నెల 23వ తేదీన ఎన్నికలు నిర్వహించబోతున్నారు. జంట నగరాలలో నివసిస్తున్న ఆంధ్రా ప్రజలు చాలామంది సంక్రాంతి పండుగకు తమ తమ స్వస్థలాలకు వెళ్లి వస్తుంటారు. అలాగే కొన్ని వేల మంది శబరిమలై వెళ్లివస్తుంటారు. వారందరూ జి.హెచ్.ఎం.సి. ఎన్నికలలో తమ ఓటు హక్కు వినియోగించుకొనేందుకు వీలుగా జనవరి 23న ఎన్నికలు నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. ఈ ఎన్నికల కోసం జనవరి 7వ తేదీలోగా ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉంది.
జి.హెచ్.ఎం.సి. పరిధిలో గల 150 వార్డులలో రిజర్వేషన్ ప్రక్రియ కూడా పూర్తి అవడంతో తెలంగాణా ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. మొత్తం 150 సీట్లలో జనరల్-44, అన్-రిజర్వుడ్-44, బీసీలకు- 50, ఎస్టీలకు-2, ఎస్సీలకు-10 సీట్లను కేటాయించింది. అన్ని కోటాలలో సగం సీట్లు మహిళకు రిజర్వు చేసారు. అంటే ఈసారి జి.హెచ్.ఎం.సి. బోర్డులో సగం మంది మహిళలు ఉంటారన్న మాట.