మళ్ళీ రంగురాళ్ళ తవ్వకాలు

తూర్పుగోదావరి జిల్లాలో మళ్ళీ కొందరు వ్యాపారులు అక్రమంగా రంగురాళ్ళకోసం తవ్వకాలు ప్రారంభించారు. జిల్లాలోని అడ్డతీగల మండలం దారాలమ్మకొండ అటవీ ప్రాంతంలో వ్యాపారులు కొంతమంది కూలీలను పెట్టి రంగురాళ్ళకోసం తవ్వకాలు జరుపుతున్నారు. రంగురాళ్ళ తవ్వకాన్ని ప్రభుత్వం నిషేధించింది. అయినా విలువైన ఈ రంగురాళ్ళకోసం తవ్వకాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ తవ్వకాల విషయం పోలీసులకు, రెవెన్యూ యంత్రాంగానికి, అటవీశాఖ అధికారులకు, భూగర్భ గనులశాఖ ఉద్యోగులకు తెలిసినప్పటికీ మామూళ్ళకు బానిసలయిన ఆయా శాఖల ఉద్యోగులు జోక్యం చేసుకోవడం లేదు. మళ్ళీ రంగురాళ్ళ తవ్వకాలు తూర్పుగోదావరి జిల్లాలో మళ్ళీ కొందరు వ్యాపారులు అక్రమంగా రంగురాళ్ళకోసం తవ్వకాలు ప్రారంభించారు. జిల్లాలోని అడ్డతీగల మండలం దారాలమ్మకొండ అటవీ ప్రాంతంలో వ్యాపారులు కొంతమంది కూలీలను పెట్టి రంగురాళ్ళకోసం తవ్వకాలు జరుపుతున్నారు.

 

రంగురాళ్ళ తవ్వకాన్ని ప్రభుత్వం నిషేధించింది. అయినా విలువైన ఈ రంగురాళ్ళకోసం తవ్వకాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ తవ్వకాల విషయం పోలీసులకు, రెవెన్యూ యంత్రాంగానికి, అటవీశాఖ అధికారులకు, భూగర్భ గనులశాఖ ఉద్యోగులకు తెలిసినప్పటికీ మామూళ్ళకు బానిసలయిన ఆయా శాఖల ఉద్యోగులు జోక్యం చేసుకోవడం లేదు. పత్రికల్లో వార్తలు వచ్చినప్పుడు మాత్రం ఇద్దరు ముగ్గురు అమాయక కూలీలపై కేసులు పెట్టి తరువాత వదిలేస్తున్నారు. ఇక్కడి తవ్వకాల్లో బైటపడిన రాళ్ళను కొనుగోలు చేయడానికి రాజస్తాన్, గుజరాత్ నుంచి వస్తున్నా వ్యాపారులు రాజమండ్రి వెళ్ళి హోటళ్ళలో మకాం వేస్తున్నట్లు తెలిసింది. ఈ రంగురాళ్ళ తవ్వకాలను అరికట్టకపోతే విలువైన రాష్ట్ర సంపద అంతరించి పోయే ప్రమాదం ఉంటుంది.

 

 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu