చైనా పట్టుతో రాష్ట్ర మల్బరీ సాగుకు ముప్పు

ఇప్పుడు రాష్ట్రంలో ఎక్కడచూసినా చైనా వస్తువులే దర్శనమిస్తున్నాయి. బొమ్మలు, పెన్నులు, సెల్ ఫోన్ లు, కంప్యూటర్లు ఇలా ఒకటేమిటి నిత్యం మనకు రాష్ట్రంలో చైనా వస్తువులు దర్శనమిస్తున్నాయి. వీటివల్ల మన రాష్ట్రంలో ఇప్పటికే పలువురు ఉపాధి కోల్పోయారు. ఇప్పుడు కొత్తగా చైనా పట్టు రాష్టంలో మల్బరీ సాగును దెబ్బతీస్తోంది. చైనా నుంచి అధికారికంగా కొంత, అనధికారికంగా పెద్దేత్తున చౌకగా వచ్చిపడుతున్న ఈ చైనా సిల్క్ వల్ల రాష్ట్రంలోని మల్బరీ సాగుచేస్తున్న రైతాంగం విలవిలలాడుతోంది.

 

రాష్ట్రంలో ఇప్పటికే మల్బరీ సాగు దాదాపు 30 శాతం తగ్గింది. దీనికితోడు పట్టుగూళ్ళ రెట్లు కూడా గణనీయంగా తగ్గాయి. గత నెలవరకూ కిలో రూ.250 నుంచి రూ.300 వరకు ఉన్న స్వదేశీరకం పట్టుగూళ్ళ ధర రూ.180 నుంచి రూ.220 వరకు పడిపోయింది. అలాగే విదేశీరకం గూళ్ళు ధర రూ.450 నుంచి రూ.350కి పడిపోయింది. రెట్ల పతనంతో మల్బరీ సాగుచేస్తున్న రైతులు తీవ్ర నష్టాలకు గురవుతున్నారు. సిల్క్ దిగుమతిపై కేంద్రం సుంకాన్ని 30 నుంచి 5 శాతానికి తగ్గించడంతో రాష్ట్ర మల్బరీ సాగు రైతాంగానికి ఈ దుస్థితి ఏర్పడింది. దీంతో కొన్నిచోట్ల రైతులు విదేశీరకం గూళ్ళ ఉత్పత్తికి తాత్కాలికంగా విరామం ప్రకటించారు

 

 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu