గజల్ శ్రీనివాస్ ‘మందిర’ సీడీ ఆవిష్కరించిన సాధ్వి రితంబర
posted on Sep 15, 2014 11:14AM

ప్రముఖ గజల్ గాయకుడు డాక్టర్ గజల్ శ్రీనివాస్ హిందీలో స్వీయ సంగీత దర్శకత్వంలో గానం చూసి రూపొందించిన ‘మందిర్’ ఆడియో సీడీని ఉత్తర ప్రదేశ్‌లోని బృందావన్‌లోని వాత్సల్య జరిగిన ఒక కార్యక్రమంలో ఆధ్యాత్మికవేత్త సాధ్వి రితంబర దేవి ఆవిష్కరించారు. ఆలయ పరిరక్షణ చైతన్య గీతాలతో రూపొందిన హిందీ సీడీ ఇది. ఈ సందర్భంగా సాధ్వి రితంబర దేవి మాట్లాడుతూ, ‘‘దేవాలయాలు దేశానికి ఆత్మాలాంటివి. బాల్యం నుంచి పిల్లలకు దేవాలయం, సనాతన ధర్మంపై అవగాహన కల్పించాలి. దీనికోసం తల్లిదండ్రులు, పాఠ్యాంశాలు స్ఫూర్తి కలిగించాలి. బాల బాలికలలో సనాతనధర్మం గురించి అవగాహన కలిగించే విధంగా స్ఫూర్తిదాయక పోటీలు, సదస్సులు నిర్వహించాలి. సేవ్ టెంపుల్స్ సాంస్కృతిక రాయబారిగా డాక్టర్ గజల్ శ్రీనివాస్ దేవాలయాల పరిరక్షణ కోసం రూపొందించిన ఈ సీడీలోని గీతాల ద్వారా ఆలయ పరిరక్షణ, గోమాత విశిష్ఠత, అన్నదాన ప్రాముఖ్యం, గంగా ప్రక్షాళలకు సంబంధించి ప్రజలకు అవగాహన పెరుగుతుంది. ఈ సీడీలోని గీతాలు ప్రజలను ఆలోచింపజేస్తాయి. డాక్టర్ గజల్ శ్రీనివాస్ గాన కృషి వల్ల ప్రజలు సనాతన ధర్మం దిశగాచైతన్యవంతులు అవుతారు’’ అన్నారు. ఈ ఆడియో ఆశిష్కరణ కార్యక్రమంలో డాక్టర్ గజల్ శ్రీనివాస్‌తోపాటు గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్, సేవ్ టెంపుల్స్ వ్యవస్థాపకులు ప్రొఫెసర్ వెలగపూడి ప్రకాశరావు, శ్రీమతి గురింధర్ కౌర్, సంజయ్ బయ్యా, లోపాముద్ర తదితరులు పాల్గొన్నారు.