సర్కారీ కామెడీ
posted on May 4, 2013 2:42PM

ప్రభుత్వం ప్రజలతో కామెడీలు చేస్తుంది.. ఇన్నాళ్లు అన్నింటికీ ఆధారే ఆధారం అంటూ దేశ ప్రజలను పరుగులు పెట్టించిన ప్రభుత్వం.. ఇప్పుడు కొత్త పల్లవి అందుకుంది.. గ్యాస్‌కు సంభందించిన అన్ని రకాల లావాదేవిలకు ఆధార్ తప్పని సరి అని షరతు పెట్టిన పెద్దలు ఇప్పుడు ఆ అవసరం లేదంటూ ప్రజలకు కాస్త ఊరటనిచ్చినట్టుగా షో చేశారు.. కాని అక్కడే అసలు మెలిక వేశారు..
గ్యాస్ బుకింగ్‌కు ఆదార్‌కు ఎలాంటి సంభందం లేదు అంటూనే గ్యాస్ సబ్సిడీకి మాత్రం ఆదార్ కంపల్సరీ అంటూ కొత్త మెలిక పెట్టారు.. అప్పుడేప్పుడో ఓ సినిమా డైరెక్టర్ చెప్పినట్టుగా ఇది యాథార్ధ కథల ఆదారంగా తెరకెక్కించిన కల్పిత గాథ.. కల్సిత కథల ఆదారంగా తెరకెక్కిన యథార్ధ గాథ అన్నట్టుగా.. గ్యాస్‌కి ఆధార్‌కి సంభందం లేదు కాని, సబ్సిడీకి ఆధార్ కంపల్సెరీ అనటంపై సామాన్య ప్రజలు పెదవి విరుస్తున్నారు..
గ్యాస్ బుక్ చేయడానికైతేనేం.. గ్యాస్ సబ్సిడీకి అయితేనేం ఆధార్ లేనిదే గ్యాస్ బండ సామాన్యుడి పాలిట గుదిబండగా మారనుంది.. ప్రభుత్వ చాలని ఆధార్ కేంద్రాలతో ఇంత వరకు సగం మందికి కూడా ఆధార్ కార్డులు అందినట్టుగా లేదు.. దీంతో ఈ సబ్సిడీ మెలిక నేరుగా ప్రజల జేబులో నుండి డబ్బు తీసుకోవడానికే అంటున్నారు విశ్లేషకులు.
ఏది ఏమైనా గ్యాష్ ఆధార్ ప్రభుత్వం ఈ మూడు విషయాలు సగటు మనిషి మాత్రం నిద్రలేకుండా చేస్తున్నాయి..