అరకు కిడ్నాప్ వెనక గంజాయి ముఠా

తీగ లాగితే డొంక కదిలింది. అరకుకు చెందిన బాలుడి కిడ్నాప్ వెనక గంజాయి ముఠా ఉన్నట్లు పోలీసుల విచారణలో తేలింది. అరకుకు చెందిన ప్రకాశ్, సుశీల్ కుమార్ పల్నాడుకు చెందిన   యాసిన్ , సంతోష్ మద్య గంజాయి డీల్ జరిగింది. ఈ డీల్ ప్రకారం ప్రకాశ్ సుశీల్ కుమార్ లు గంజాయి సప్లయ్ చేయాలి 20 వేల రూపాయలు ఫోన్ పే ద్వారా యాసిన్, సంతోష్ చెల్లించారు. అయినప్పటికీ ప్రకాశ్ , సుశీల్ కుమార్ లు  ఎంతకూ గంజాయి సప్లయ్ చేయకపోవడంతో  ప్రకాశ్ బంధువుల అబ్బాయిని యాసిన్, సంతోష్ కిడ్నాప్  చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాలుడిని కిడ్నాప్ నుంచి విముక్తి కల్పించి ప్రకాశ్, సుశీల్ కుమార్ లను అరెస్ట్ చేశారు.