శివసేన ఎంపీతో మారిన రూల్స్...
posted on May 5, 2017 12:28PM
.jpg)
శివసేన ఎంపీ రవీందర్ గైక్వాడ్ ఎయిర్ ఇండియా విమాన సిబ్బందిపై దాడి చేసిన ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఇందుకు గాను ఎయిర్ ఇండియాతోపాటు పలు విమాన సంస్థలు కూడా ఆయనపై నిషేదం విధించాయి. అయితే ఈ ఘటన అనంతరం ఇప్పుడు కేంద్రం కొన్ని నిబంధనలను తీసుకొచ్చింది. ఈ సందర్భంగా కేంద్ర విమానయాన శాఖ మంత్రి అశోక్‌గజపతి రాజు మాట్లాడుతూ... తోటి ప్రయాణికులకు ఇబ్బంది కలిగించినా, విమానాశ్రయంలో గానీ, విమానంలో గానీ, సిబ్బందితో ఘర్షణకు దిగినా ఆ వ్యక్తి నేరం చేసినట్లుగా భావించి అతని పేరును ‘నో ఫ్లై లిస్టు’లో నమోదు చేస్తామని చెప్పారు. ఒక్కసారి ఈ లిస్టులో పేరు నమోదైతే ఇక అతను ఏ విమానంలోనూ ప్రయాణించే వీలు ఉండదని అన్నారు. అంతేకాదు సిబ్బందిపై దౌర్జన్యానికి దిగితే 3 నెలలు, దాడికి పాల్పడితే ఆరు నెలలు.. చంపేస్తానంటూ బెదిరింపులకు దిగితే రెండేళ్ల జైలు శిక్ష పడుతుందని తెలిపారు.