అమెరికా వీసా కొత్త రూల్.. ఎఫ్భీ వివరాలు చెప్పాల్సిందే..
posted on May 5, 2017 12:08PM
.jpg)
అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన దగ్గర నుండి ట్రంప్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంటూ అందరికీ షాకులిస్తున్న సంగతి తెలిసిందే. అందులో ముఖ్యంగా వీసా నిబంధనల్లో మార్పులు. వీసా నిబంధనల్లో పలు మార్పులు చేస్తూ ఆ దేశానికి వెళ్లాలనుకుంటున్నవారి గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తున్నారు. ఇప్పటికే నిబంధనలు కఠినతరం చేసిన ట్రంప్ ఇప్పుడు తాజాగా మరో కొత్త రూల్ ప్రకటించారు. అదేంటంటే...ఇకపై అమెరికా వీసా కావాలంటే సోషల్ మీడియా అకౌంట్ల వివరాలు, ఈమెయిల్, ఫోన్ నెంబర్లన్నీ చెప్పాల్సిందేనంటూ కొన్ని దేశాల వారికి నిబంధన విధించారు. దీనికి సంబంధించిన నోటీసును ఫెడరల్ రిజిస్టర్ వెల్లడించింది. ఉగ్రవాద కార్యకలాపాలు జరుగుతున్నాయని అమెరికాకు అనుమానం ఉన్న కొన్ని దేశాల నుంచి వచ్చే ప్రయాణీకులు అత్యంత కఠినమైన తనిఖీలను ఎదుర్కోవాల్సి ఉంటుందని అధికారులు తేల్చిచెప్పారు.