ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్‌కు ఏసీబీ నోటీసులు

 

ఫార్ములా ఈ రేసు కేసులో ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్‌కు ఏసీబీ నోటీసులు జారీ చేశారు. జూలై 1 విచారణకు హజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నాది. అరవింద్ కుమార్‌ను మరోసారి విచారణ జరిపి స్టేట్‌మెంట్‌ రికార్డు చేయనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కుమార్తె కాన్వకేషన్ కోసం యూరోప్ పర్యటనలో ఉన్నారు. అయితే, ఇటీవల ఇదే ఫార్ములా ఈ కార్‌ రేసు కేసులో బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ను ఏసీబీ అధికారులు రెండోసారి విచారించారు.

విచారణ తర్వాత అందిన సమాచారంతో ఏసీబీ అధికారులు ఐఏఎస్‌ అరవింద్‌ కుమార్‌కు నోటీసులు పంపించినట్లు తెలుస్తోంది. హెచ్ఎండీఏ రిటైర్డ్ చీఫ్ ఇంజినీర్ బీఎల్ఎన్ రెడ్డిను ఏసీబీ విచారించిన విషయం తెలిసిందే. 2022 అక్టోబర్ 25న జరిగిన తొలి ఒప్పందంపై కంపెనీ ప్రతినిధులను ఏసీబీ ప్రశ్నిస్తోంది. సీజన్ 9, తర్వాత రేస్‌ల నిర్వహణ బాధ్యత నుంచి తప్పుకోవడంపై ఆరా తీస్తున్నారు.