సుప్రీంకోర్టులో పిటిషను వేసిన మాజీ ప్రధాని డా.మన్మోహన్ సింగ్
posted on Mar 26, 2015 9:12AM
.jpg)
మాజీ ప్రధాని డా.మన్మోహన్ సింగ్ తో సహా మొత్తం ఆరుమందిని ఏప్రిల్ 6న బొగ్గు గనుల కుంభకోణంలో విచారణకు హాజరుకమ్మని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం నోటీసులు జారీ చేయడంతో కాంగ్రెస్ పార్టీలో కలకలం రేగింది. ఆయనకు సంఘీభావం ప్రకటించేందుకు పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ తన పార్టీ నేతలను వెంటేసుకొని డిల్లీలో తమ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుండి ఆయన ఇంటివరకు పాదయాత్ర నిర్వహించారు కూడా. ఆ తరువాత చాలా మంది ఇతర పార్టీలకు చెందిన నేతలు ఆయనను కలిసి సంఘీభావం ప్రకటిస్తున్నారు. కానీ అవేవీ కోర్టు విచారణను ఆపలేవు గనుక సీబీఐ కోర్టు తనకు సమన్లు జారీ చేయడాన్ని సవాలు చేస్తూ డా.మన్మోహన్ సింగ్ నిన్న సుప్రీంకోర్టులోఒక పిటిషను వేసారు. ఆయనతో బాటే ఈకేసులో సీబీఐ కోర్టు నుండి సమన్లు అందుకొన్న హిండాల్కో చైర్మన్ కుమార మంగళం బిర్లా కూడా సుప్రీంకోర్టులో పిటిషను వేసారు.