లైంగిక దాడి కేసులో దోషిగా మాజీ ఎంపీ

 

అత్యాచారం కేసులో జనతాదళ్ సెక్యులర్ మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణను దోషిగా పేర్కొంటూ బెంగళూరులోని ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టు తీర్పునిచ్చింది. రేపు శిక్షణను ఖరారు చేస్తామని వెల్లడించింది. రేవణ్ణ మైసూరులోని తన ఇంట్లో పని చేస్తున్న మహిళను రేప్ చేసి వీడియో తీశారని కేసు నమోదైంది. డిసెంబర్ 31 2024 నుంచి దర్యాప్త్య మొదలైంది. 

హసన్ జిల్లా హోలినరసిపుర రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఆయనపై దాఖలైన ఫిర్యాదుకు సంబంధించిన కేసులో కోర్టు ఈ తీర్పునిచ్చింది. జూలై 18న ఈ కేసులో విచారణ పూర్తి కాగా.. తీర్పును రిజర్వ్ చేశారు. తాజాగా ప్రత్యేక కోర్టు తీర్పును వెలువరించింది. శిక్షాకాలాన్ని ఆగస్టు 2న ప్రకటించనుంది. పలువురు మహిళలపై ప్రజ్వల్ లైంగిక దాడులకు పాల్పడినట్టు చూపిస్తూ 2,000కు పైగా వీడియో క్లిప్‌లు సోషల్ మీడియాలో వెలుగుచూడటం సంచలనమైంది. 

దీనిపై 2024లో ఆయనపై నాలుగు క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. ప్రజ్వల్ ఫ్యామిలీకి చెందిన ఫామ్ హౌస్‌లో పనిచేసే మహిళ 2024 ఏప్రిల్‌లో మొదటగా ఆయనపై ఫిర్యాదు చేసింది. 2021 నుంచి పదేపదే తనపై లైంగిక దాడి చేశారని, బయటకు చెబితే వీడియోలు విడుదల చేస్తామని బెదిరిస్తూ బ్లాక్‌మెయిల్ చేశారని ఆమె తన ఫిర్యాదులో ఆరోపించింది.
 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu