పోలీసులు నీళ్లు లేని బావిలో దూకి చావాలి...రోజా సంచలన వ్యాఖ్యలు
posted on Jan 6, 2026 1:42PM

వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి ఆర్కే రోజా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పోలీసులు నీళ్లు లేని బావిలో దూకి చావాలని సంచలన వ్యాఖ్యలు చేశారు.దేశంలోనే అట్టడుగు స్ధానంలో ఏపీ పోలీస్ శాఖ ఉందని రోజా విమర్శించారు. కేంద్ర నివేదికను చూసి సీఎం చంద్రబాబు, హోంశాఖ మంత్రి అనిత సిగ్గుపడాలని విమర్శించారు.
మన పోలీస్ వ్యవస్ధను చూసి అందరు నవ్వుతున్నారని తెలిపారు. నెల్లూరు జైలులో పిన్నెల్లి సోదురులతో ములాఖత్ అయ్యారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వైసీపీ నేతలపై అక్రమ కేసులతో వేధిస్తోందని ఆమె మండిపడ్డారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు వైసీపీ హయంలో రూ. 960 కోట్లతో పనులు చేపట్టితే.. ఆ పనులను కూటమి ప్రభుత్వం ఆపాలని చూస్తోందని రోజా ఆరోపించారు. ఇంత జరగుతుంటే డిప్యూటీ సీఎం పవన్ ఎందుకు ప్రశ్నించడం లేదని మాజీ మంత్రి రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు