మహాకుంభ్ పై పూల వర్షం..
posted on Feb 12, 2025 2:21PM

మహాకుంభమేళాకు భక్తులు పోటెత్తుతున్నారు. ఇప్పటికే 45 కోట్ల మందికి పైగా ప్రయాగ్ రాజ్ లోని త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు ఆచరించారు. బుధవారం (ఫిబ్రవరి 12) మాఘ పౌర్ణిమ కావడంతో భక్తులు అంచనాలకు మించి పోటెత్తారు. దీంతో ప్రయాగ్ రాజ్ ను నో వెహికిల్ జోన్ గా ప్రకటించిన అధికారులు భక్తులకు ఎటువంటి ఇబ్బందులూ ఎదురు కాకుండా అవసరమైన ఏర్పాట్లు చేశారు. ఈ ఏర్పాట్లను ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ లక్నో నుంచే పర్యవేక్షిస్తూ, అధికారులకు ఎప్పటికప్పుడు అవసరమైన సూచనలు చేస్తున్నారు.
బుధవారం తెల్లవారుజాము నుంచే త్రివేణి సంగమంలో లక్షలాది మంది భక్తులు పవిత్ర స్నానాలు ఆచరించడం మొదలైంది. మాఘ పూర్ణిమ సందర్భంగా కుంభమేళాలో పుణ్యస్నానాలు ఆచరిస్తున్న భక్తులపై అధికారులు హెలికాప్టర్ ద్వారా పూలవర్షం కురిపించారు.