టాటా- ఎర్నాకుళం ఎక్స్ ప్రెస్ లో మంటలు..ఒకరు సజీవదహనం

టాటా- ఎర్నాకుళం ఎక్స్ ప్రెస్ లో ఆదివారం అర్ధరాత్రి అగ్రిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఒకరు సజీవదహనమయ్యారు. విశాఖ నుంచి ఎర్నాకుళం వెడుతున్న ఈ రైలులో ఎలమంచలి సమీపంలో మంటలు చెలరేగాయి.  వెంటనే అప్రమత్తమైన లోకో పైలట్లు ఎలమంచిలి స్టేషన్‌లో రైలును నిలిపివేసే లోపే ఆ బోగీలు పూర్తిగా దగ్ధమయ్యాయి.

మంటలు, దట్టమైన పొగతో బోగీలలోని ప్రయాణీకులు ఉక్కిరిబిక్కిరి అయ్యారు.   అగ్నిమాపక యం త్రాలు వచ్చేసరికే రెండు బోగీలు పూర్తిగా కాలిబూడిదయ్యాయి. బీ1 బోగీలో ప్రయాణిస్తున్న 70 ఏళ్ల వృద్ధుడు బయటకు రాలేక మంటల్లో చిక్కుకుపోయి మరణించాడు. మృతుడిని విశాఖపట్నానికి చెందిన చంద్రశేఖర్ సుందర్‌గా గుర్తించారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu