నిమ్స్ లో ఫైర్ యాక్సిడెంట్
posted on Apr 20, 2025 8:37AM

పంజాగుట్టలోని నిమ్స్ ఆస్పత్రిలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఎమర్జెన్సీ వార్డులో శనివారం (ఏప్రిల్ 19)ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. నిమ్స్ ఐదో అంతస్తులోని ఎమర్జెన్సీ వార్డులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దట్టంగా పొగలు కమ్ముకున్నాయి. దీంతో రోగులు, సిబ్బంది ఉక్కిరిబిక్కిరయ్యారు. తీవ్ర భయాందోనలకు గురయ్యారు. మంటలు వేగంగా వ్యాపించడంతో వార్డులలో నుంచి బ సిబ్బంది, పేషెంట్స్ బయటకు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది మంటలు అదుపు చేశారు. ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదు. ఎమర్జెన్సీ వార్డు కావడంతో పేషెంట్స్ ప్రాణభయంతో ఉక్కిరిబిక్కిరయ్యారని, పేషెంట్స్ కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం సంభవించిందని ప్రాథమికంగా నిర్థారించారు.
ఈ సంఘటనపై స్పందించిన నిమ్స్ యాజమాన్యం నిమ్స్ ఆస్పత్రి ఐదో అంతస్తులో షార్ట్ సర్క్యూట్ కారణంగా జరిగిన అగ్నిప్రమాదంలో ఎవరూ గాయపడలేదనీ, ఎవరికీ ఎలాంటి అపాయం కలగలేదనీ పేర్కొంది. అగ్నిప్రమాదం ఐదో అంతస్తులో ఆడిటోరియం వద్ద జరిగిందనీ, అక్కడ పేషెంట్లు ఎవరూ ఉండరనీ పేర్కొంది. పొగలు వచ్చిన వెంటనే అప్రమత్తమైన సిబ్బంది అప్రాంతం నుంచి అందరినీ తరలించేశారనీ వివరించింది. కాగా నిమ్స్ లో అగ్నిప్రమాదం సమాచారం తెలియగానే ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఫోన్ లో నిమ్స్ డైరెక్టర్ తో ఫోన్ లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.