షూటింగ్ లో అగ్నిప్రమాదం, 6 గురు సజీవ దహనం

 

Fire accident at shooting, Fire accident manikonda, Fire accident hyderabad, Fire accident 2012

 

హైదరాబాద్ లో ఓక టీవి సీరియల్ కోసం వేసిన సేట్ లో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడిక్కడే సజీవ దహనం అయ్యారు. సెట్లో లోని మంటలు పక్కనే ఉన్న అపార్ట్ మెంట్ కి వ్యాపించడంతో అందులో ఉంటున్నవారు ఉపరి ఆడాక ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బయటకు పరుగులు తీశారు. చనిపోయిన వారిలో ఇద్దరు చిన్నారులు ఉన్నారు.


మణికొండ శివార్లలో సెక్రెటేరియట్ కాలనిలో ఓ సినిమా షూటింగ్ కోసం ఏర్పాటు చేసిన సెట్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ మంటలు పక్కనే ఉన్న బాబా అపార్ట్ మెంట్ కి వ్యాపించాయి. బిల్డింగ్ అంతా పొగ కమ్ముకోవడంతో ఉపిరి తీసుకోలేక ఉక్కిరిబిక్కిరయ్యారు.  ప్రమాద స్థలానికి పోలీసులు, ఫైర్‌ సిబ్బంది సకాలంలో స్పందించకపోవడం వల్లే ఇంత భారీ ప్రమాదం జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు మరోవైపు ప్రభుత్వ అధికారులు కళ్లుమూసుకుని అపార్ట్‌మెంట్లకు అనుమతులు ఇవ్వడం వల్లే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని.. విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu