విశాఖలో రేపిస్ట్ సైకో..
posted on Nov 26, 2012 3:01PM

ఆడామగా.. ఆరుబైట చల్లగాలికి హాయిగా మంచాలేసుకుని పడుకున్నారు. మంచి నిద్రలో ఎవరో మీదకొచ్చి ఏదో చేస్తున్నట్టు ఓ పీడకల. ఛటుక్కున కళ్ళు తెరిచి చూసేసరికి అది కలకాదు.. నిజమే.. ముఖానికి ముసుగేసుకున్న ఓ మనిషి వంటిమీద నూలుపోగైనా లేకుండా మీదపడి ఏదో చేయబోతున్న విషయాన్ని గ్రహించిన ఆడాళ్లు పెద్దపెట్టున కేకలు పెట్టారు. గోలగోలవుతోందని గ్రహించిన ఆ సైకో అలాగే దిసిమొలతోనే చీకట్లోకి పారిపోయాడు.
ఇదేదో హార్రర్ సినిమానో లేక బూతు సినిమానో కాదు.. విశాఖ జిల్లాలో నిజంగా జరిగిన విషయం. ఇందిరానగర్ మధురవాడలోకి ప్రవేశించిన ఓ సైకో తలకి ముసుగేసుకుని దిసిమొలతో ఆడాళ్లను టార్గెట్ చేస్తూ ఏదో చేయబోయినప్పుడు జరిగిన వాస్తవ సంఘటన ఇది.
ఆరుబైట పడుకున్న మహిళల్ని అత్యాచారం చేయడానికి ప్రయత్నించిన సైకో.. వాళ్లు ఎదురుతిరిగేసరికి పారిపోయాడు. పోతూపోతూ ముగ్గురు మహిళల్ని తీవ్రంగా గాయపరిచి చీకట్లో మాయమైన సైకోకోసం స్థానికులు ఎంతగా గాలించినాకూడా లాభం లేకపోయింది.