బంగ్లాదేశ్ లో అగ్ని ప్రమాదం, 121 మంది మృతి

 

 bangladesh fire accident, bangladesh fire factory, bangladesh factory fire 2012, bangladesh factory fire

 

బంగ్లాదేశ్‌లో దుస్తుల ఫ్యాక్టరీలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 121 మంది మృతి చెందారు. ఉత్తర ఢాకాకు ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉన్న బహుళ అంతస్తుల దుస్తుల ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం జరిగింది. ప్రమాదంలో పది మంది వరకు మృతి చెంది ఉంటారని అనుకున్నారు. ఈ రోజు ఉదయం 112 మృతదేహాలు వెలికి తీశారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం సంభవించిందని భావిస్తున్నారు. మంటల నుంచి తప్పించుకునేందుకు కొందరు భవనం పైనుండి దూకారు. విషయం తెలియగానే ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది, అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu