‘గబ్బర్‌సింగ్’ 60 సార్లు.. ‘అత్తారింటికి..’ 20 సార్లు చూసిన రేణు
posted on Oct 15, 2014 9:40AM

పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణుదేశాయ్ ఛాన్స్ దొరికినప్పుడల్లా పవన్ కళ్యాణ్‌ని పొగిడే పనిలో వుంది. ఆయన మరో పెళ్ళి చేసుకుని హ్యాపీగా వున్నాడు. మళ్ళీ నువ్వీ పొగడ్తల కార్యక్రమం చేపట్టావేంటమ్మా అంటే.. నేనేం పవన్‌కి దగ్గరయ్యే ప్రయత్నాలు చేయడం లేదని చెబుతోంది. రేణు దేశాయ్ తాజాగా పవన్ నటించిన ‘గబ్బర్‌సింగ్’ సినిమాని తెగ పొగిడేసింది. ఆ సినిమా అంటే తనకు ఎంతో ఇష్టమని, ఇప్పటికి అరవై సార్లకు పైగా ఆ సినిమా చూశానని, డీవీడీకి గీతలు పడిపోయినా వదలకుండా పదేపదే చూస్తూనే వున్నానని రేణు చెబుతోంది. తమ పిల్లలు కూడా గబ్బర్ సింగ్ సినిమాని చూస్తూనే వుంటారని చెబుతోంది. అత్తారింటికి దారేది సినిమా కూడా తనకు ఇష్టమని, ఆ సినిమాని ఇప్పటి వరకు దాదాపు ఇరవైసార్లు చూశానని రేణు దేశాయ్ మురిసిపోతూ చెబుతోంది. అన్నట్టు రేణు దేశాయ్ దర్శకత్వం వహించిన మరాఠీ సినిమా ‘ఇష్క్ వాలా లవ్’ త్వరలో తెలుగులో కూడా విడుదల కాబోతోంది.