స్టార్ హీరోయిన్.. సినిమాలకు గుడ్‌బై

 

హాలీవుడ్ హాట్ హీరోయిన్, స్టార్ హీరోయిన్ ఏంజిలీనా జోలీ వయసు మీదపడినా ఇప్పటికీ కుర్రకారుకు ఆరాధ్య దేవతగానే వుంది. త్వరలో ఆమె తన అభిమానులకు షాక్ ఇవ్వబోతోంది. అది ఏమిటంటే, ఆమె త్వరలో నటనకు గుడ్‌బై చెప్పబోతోంది. అయితే ఆ షాక్ ఇవ్వడంతోపాటు మరో ఆనందాన్ని ఇవ్వబోతోంది. ఆమె నటన మానేసినప్పటికీ సినిమాలకు దూరమవ్వదట. త్వరలో దర్శకురాలి అవతారంలో కనిపించబోతోందట. ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఏంజిలినా జోలి మాట్లాడుతూ, ప్రస్తుతం తనకు నటన కంటే మెగాఫోన్‌ పట్టుకోవడంలోనే ఎక్కువ ఆసక్తి ఉందని, త్వరలో తాను నటనకు గుడ్‌బై చెప్పి దర్శకత్వంలోకి ఎంటరైపోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని ఆమె చెప్పింది. ‘‘ఎందుకో నాకు ఇప్పుడు నటించడం అంటే అసలు ఇష్టం వుండటం లేదు. కెమెరా ముందు నిలబడాలంటే అసౌకర్యంగా అనిపిస్తోంది. ఇక నుంచి పూర్తి స్థాయిలో ఫిల్మ్ మేకింగ్ పై దృష్టి పెడతా. దర్శకురాలిగా కూడా రాణిస్తానని ఆశిస్తున్నా’’ అని ఏంజిలినా స్పష్టం చేసింది. ఏంజిలినా నటించిన ‘మేల్ ఫీసెంట్’ సినిమా ఇటీవల విడుదలై బాక్సాఫీస్ దగ్గర దుమ్ము లేపింది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu