వైజాగ్‌లో సిలెండర్ పేలి ఇద్దరి మృతి

 

విశాఖపట్నంలో గ్యాస్ సిలెండర్ పేలిన దుర్ఘటనలో ఇద్దరు మరణించారు. నగరంలోని పూర్ణా మార్కెట్ సమీపంలో వున్న రంగ్రీజు వీధిలోని ఓ బిల్డింగ్‌లో మంగళవారం ఉదయం గ్యాస్ సిలెండర్ పేలింది. ఈ దుర్ఘటనలో ఒక మహిళ మరణించగా, 20 మంది తీవ్రంగా కాలిన గాయాలకు గురయ్యారు. గ్యాస్ సిలెండ్ పేలిన బిల్డింగ్ కూడా పేలుడు ధాటికి కూలిపోయింది. ఈ పేలుడు జరిగిన సమయంలో ఆ భవంతిలో వున్న మహిళ మరణించగా, పేలుడు శబ్దానికి ఎదురింటిలో వున్న  పసికందు కూడా మరణించింది. ఈ ప్రమాదంలో గాయపడిన వారిలో నలుగురి పరిస్థితి విషమంగా వున్నట్టు సమాచారం. వీరిలో ముగ్గురి శరీరాలు పూర్తిగా కాలిపోయాయి. పేలుడు ధాటికి చుట్టుపక్కల ఇళ్ళలో వున్న స్థానికులు ప్రాణభయంతో బయటకి పరుగులు తీశారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu