ఉపఎన్నికల తరువాత జగన్ పార్టీలో చేరనున్న తలసాని
posted on May 1, 2012 10:32AM
వచ్చే ఉపఎన్నికల అనంతరం మాజీ మంత్రి, టిడిపి సీనియర్ నేత తలసాని శ్రీనివాస యాదవ్ వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్లు తెలిసింది. దేవేంద్రగౌడ్ కు రాజ్యసభ టిక్కెట్టు ఇవ్వటాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన తలసాని గత రెండు నెలలుగా పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. దీనికి తోడు ఇక తెలుగుదేశం పార్టీకి రాష్ట్రంలో భవిష్యత్తు ఉండదనే భావనతో ఆయన ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే ఆయన ఉపఎన్నికల అనంతరం జగన్ పార్టీలో చేరాలని యోచిస్తున్నట్లు తెలిసింది.
ప్రస్తుతం సికింద్రాబాద్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న శాసనసభ్యురాలు జయసుధ మొదట్లో జగన్ పార్టీ వైపు మొగ్గుచూపి తరువాత కాంగ్రెస్ లోనే ఉండిపోయారు. దీంతో ఆగ్రహం చెందిన జగన్ సికింద్రాబాద్ లో బలమైన నాయకునిగా పేరున్న తలసాని శ్రీనివాస యాదవ్ తో రహస్య మంతనాలు జరిపినట్టు తెలిసింది. తలసాని శ్రీనివాస యాదవ్ పార్టీ మారితే టిడిపికి గ్రేటర్ హైదరాబాద్ లో కోలుకోలేని దెబ్బ తగులుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. గ్రేటర్ పరిథిలో తెలుగుదేశం తెలుగుదేశంపార్టీ ఇప్పటికే చాలా బలహీనంగా ఉంది. తలసాని వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీలో చేరితే ఆ పార్టీ పరిస్థితి మెరుగవుతుంది.