ఎవడు ఆడియో: పవన్ కాదు చిరంజీవే!

 

 Evadu Audio Release, Evadu Audio chiranjeevi, ram charan allu arjun evadu

 

 

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఎవడు 'ఆడియో' ఈ రోజు సాయంత్రం గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ ఆడియో ఫంక్షన్ కి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్య అతిధిగా వస్తారని మీడియాలో వార్తలు వచ్చాయి. తాజాగా వస్తున్న సమాచారం ప్రకారం... పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ ఆడియో కార్యక్రమానికి హాజరు కాకపోవచ్చునని..మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిధిగా వస్తారని అంటున్నారు.

 

'ఎవడు' ఆడియో రిలీజ్ కి ఇండస్ట్రీ నుంచి పలువురు ప్రముఖులు హాజరుకాబోతున్నారని సమాచారం. అల్లు అర్జున్ తో పాటు మెగా హీరోలు కొంతమంది ఫంక్షన్ కి హాజరుకానున్నారు. ఈ కార్యక్రమానికి 'సుమ' యాంకర్ గా వ్యవహరించనుంది. యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో శృతి హాసన్ హీరోయిన్. బ్రిటిష్ మోడల్ అమీ జాక్స్ సెకండ్ హీరోయిన్ గా చేస్తోంది. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఈ చిత్రంలో అతిథి పాత్రలో కనిపించనున్నాడు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu