జియాఖాన్ ఆత్మహత్య: సూరజ్ కు బెయిల్
posted on Jul 1, 2013 5:09PM

బాలీవుడ్ నటి జియాఖాన్ ఆత్మహత్య కేసులో అరెస్టైన ఆమె ప్రియుడు సూరజ్ పంచోలికి బెయిల్ దొరికింది. ముంబై హై కోర్ట్ ఈ రోజు సూరజ్ పంచోలికి బెయిల్ మంజూరు చేసింది. వేల పూచీ కత్తుతో పాటు, పాస్ పోర్ట్ ను స్వాదీనం చేయాలని కోర్ట్ ఆదేశించింది. పోలీసులు విచారణకు పిలిచినప్పుడల్లా హాజరుకావాలని సూచించింది.ముంబై సెషన్స్ కోర్టు సూరజ్‌కు బెయిల్ మంజూరు చేయడానికి నిరాకరించగా,అతను హైకోర్టును ఆశ్రయించాడు.
జియా ఖాన్ జూన్ 3వ తేదీన ముంబై జుహు లోని తన నివాసంలో ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. జియాఖాన్ రాసిన సుసైడ్ నోట్ ఆధారంగా సూరజ్ పంచోలిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ లేఖలో సూరజ్ తనను మానసికంగా, శారీరకంగా హింసించాడని జియా ఖాన్ పేర్కొంది. అంతే కాకుండా సూరజ్ వల్ల తాను గర్భం దాల్చానని, అబార్షన్ కూడా అయిందని పేర్కొంది.