చలి చంపేస్తోంది.. ఎండలు మాడ్చేస్తాయి.. వాతావరణ మార్పులతో జనం బెంబేలు

కోల్డ్ వేవ్ ఎముకలను కొరికేస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా జనవరి మూడో వారం వచ్చినా చలి తీవ్రత తగ్గుముఖం పట్టలేదు సరికదా, పెరుగుతూ పోతోంది. తెలుగు రాష్ట్రాలలో వాతావరణం సాధారణానికి భిన్నంగా ఉందని జనం అంటున్నారు. ఈ ఏడాది డిసెంబర్ చివరి వారంలోనే కాదు జనవరి మొదటి వారంలోనూ తెలుగు రాష్ట్రాలలో వర్షాలు కురిశాయి. అదో విచిత్ర వాతావరణం అనుకుంటే.. జనవరి మూడో వారంలో  కూడా ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పడిపోతూ ప్రజలను వణికించేస్తున్నాయి.

ఉదయం పది గంటల వరకూ, ఆ తరువాత సాయంత్రం ఐదు గంటల నుంచే చలి తీవ్రత ఎముకలను కొరికేసే స్థాయిలో ఉంటోంది. తెలుగు రాష్ట్రాలలో చలి తీవ్రత జనవరి మూడో వారంలోనూ తగ్గలేదు సరికదా రోజురోజుకూ పెరుగుతోంది. ఇదే పరిస్థితి మరి కొన్ని రోజుల పాటు కొనసాగే పరిస్థితి ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. అంతే కాదు.. వచ్చే వేసవి కూడా ప్రజలకు ఓ పీడకలగా మారనుందని అంటోంది. అధిక ఉష్ణోగ్రతలతో జనం ఇబ్బందులు పడతారని చెబుతోంది. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu