లేటెస్ట్ నవరస చిత్రాలు ఈ ఎమోజీలు!

మనిషికి జీవితంలో భావవ్యక్తీకరణ ఎంతో ముఖ్యమైనది. కొందరు ఈ వ్యక్తికరణను ముఖకవళికల ఆధారంగా వ్యక్తం చేస్తుంటారు. ఏదైనా ఒక భావోద్వేగాన్ని వ్యక్తం చేయడానికి నవరసాలను ముఖంలోకి తీసుకొచ్చి వాటిని బయటపెడుతుంటారు. సందర్భాన్ని బట్టి, మనిషి మూడ్ ని బట్టి వ్యక్తీకరణలు మారుతుంటాయి. అయితే నేటి వేగవంతమైన కాలంలో స్నేహితులు కావచ్చు, ఆత్మీయులు కావచ్చు, రిలేషన్ లో ఉన్నవారు కావచ్చు దూరంగా ఉంటున్నవాళ్ళు ఫోన్ కాల్స్ లోనూ, చాటింగ్ లోనూ ఒకరిని ఒకరు పలకరించుకుంటూ  ఉంటారు. ఇలా పలకరించుకునే  సమయంలో ఎక్స్ప్రెషన్స్ బయట పెట్టడానికి అందరూ వాడుతున్నవి ఎమోజిస్. 

నవ్వడం, ఏడవడం, కోపం, బాధ, అసహనం, ప్రయాణాలు, వంట చేయడం, అనారోగ్యం ఇలా ప్రతి సందర్భానికి ఎమోజీలు ఉన్నాయి. చాటింగ్ చేసుకునేవాళ్ళు సింపుల్ గా ఎమోజీలు పెట్టి తమ సిట్యుయేషన్ ను అవతలివాళ్లకు చెబుతుంటారు. అయితే ఈ ఎమోజీలు ప్రస్తుత నెట్ యుగంలో చాలా చాలా పెద్ద పాత్ర పోషిస్తున్నాయి. వీటి వాడకం లేని సామాజిక మాధ్యమాల సంభాషణలు సాగడం లేదంటే అర్థం చేసుకోవచ్చు. ఫేస్ బుక్, వాట్సాప్, టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్ మొదలైన మాధ్యమాలలో ఎమోజీల హాంగమా అంతా ఇంతా కాదు. 

అసలు ఎమోజీలు ఎక్కడివి?

ఒకసారి మీరు చేసిన ఆన్లైన్ చాటింగ్ గమనిస్తే ఆ చాటింగ్ లో హార్ట్ సింబల్స్, లాఫింగ్ సింబల్స్, స్లీపింగ్ సింబల్స్, స్మైలీ ఫేస్ లు, యాంగ్రీ ఫేస్ లు ఇలా ఎన్నో రకాల ఎమోజీలు చాలానే వచ్చి ఉంటాయి. ఎమోజి అని పిలువబడే ఈ ఐకానిక్  జపనీస్ చిత్రాలు ఇంటర్నెట్‌లో బాగా ప్రాచుర్యం పొందాయి. ప్రతి సక్సెస్ ను సెలబ్రేట్ చేసుకోవడం ఇప్పట్లో కామన్ అయినట్టు ఈ ఎమోజీల విజయాన్ని కూడా  జూలై 17న ఎమోజీ డే గా గుర్తించి సెలబ్రేట్ చేసుకుంటారు.

ఎమోజీ డే రోజు జరిగే అక్టీవిటీస్!

బుల్లి ఎమోజీలతో, చిన్న సరదాలు, చెప్పలేనంత సంతోషాలు స్నేహితులు, సన్నిహితుల మధ్య క్రియేట్ చేసుకోవచ్చు. సంభాషణలను కేవలం ఎమోజీలు ద్వారా మాత్రమే చేయడం చెప్పలేనంత ఫన్ గా ఉంటుంది.

ఈకాలంలో క్రియేటివిటికి కొదవలేదు. ప్రయోగాలు చేసి సొంత ఎమోజీలు సృష్టించడం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఇలాంటి క్రియేటివిటీల విషయంలో  స్నేహితుల మధ్య చిన్న చిన్న ఛాలెంజ్ లు కూడా పెట్టుకోవచ్చు.

వేసుకునే డ్రెస్ , ఉపయోగించే వస్తువులు ఇంకా వివిధ రకాల వాటి మీద ఎమోజీ చిత్రాలు వేయడం, రోజంతా ఆ ఎమోజీల ఫన్ ను అందరితో ఎంజాయ్ చేయడం.

ఎమోజీలు విషయంలో అందరూ కనెక్ట్ అవ్వడానికి కారణం ఏంటో తెలుసా?

భాషతో సంబంధం లేకుండా వ్యక్తీకరణ అందరికీ తెలిసిపోవడం ఈ ఎమోజీల స్పెషల్.

వెటకారం, వ్యంగ్యం, హాస్యం, సంతోషం వంటి అన్ని రకాల ఎక్స్ప్రెషన్స్ ఎమోజీలతో సాధ్యమవుతుంది. మొబైల్ పాడ్ లో లేని ఎమోజీ అంటూ ఉండదు. బహుశా వాటిలో చాలావరకు మనం వాడనివి కూడా ఉంటాయి.

ఇవి మంచి కోడింగ్ కాన్సెప్ట్ లాగా పనిచేస్తాయి. కమ్యూనికేషన్  జరిగేటప్పుడు సరదాగా వీటితో చిన్న చిన్న పజిల్స్ లాంటివి ప్లే చేయచ్చు.

అవన్నీ సరదా అయితే కాస్త చిరాకు, కోపం, అసహమ్ లో ఉన్నప్పుడు మాట్లాడాలని లేనప్పుడు కూడా ఎమోజీ తో రిప్లయ్ ఇవ్వచ్చు, అలాగే పనులలో ఉన్నప్పుడు ఎమోజిలే మంచి మార్గం.

ఇలా ఎమోజీలు రోజువారీ మన చేతుల్లో చాలానే దొర్లిపోతుంటాయి. ఒకవేళ ఈ ఎమోజీ డే లు గట్రా పిచ్చి పనిగా ఎవరికైనా తోస్తే ఒక సైలెంట్ ఎమోజీ చూసి ఆ భంగిమలోకి మారిపోండి.

                               ◆ వెంకటేష్ పువ్వాడ.