డోజ్ చైర్మన్ పదవికి ఎలాన్ మస్క్ రాజీనామా ట్రంప్ కి బిగ్ షాక్!

టెస్లా అధినేత ఎలాన్ మస్క్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. అమెరికా ప్రభుత్వంలో తాను నిర్వహిస్తున్న డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్‌ ఎఫీషియెన్సీ (డోజ్) ఛైర్మన్ పదవికి రాజీనామా  చేశారు. తన రాజీనామాను ఆయన సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్ ద్వారా ప్రకటించారు.   అమెరికా ప్రభుత్వంలో ప్రత్యేక ప్రభుత్వ ఉద్యోగిగా సేవలందించే కాలపరిమితి ముగిసిందని, అందుకే ఆ పదవికి రాజీనామా చేస్తున్నాననీ మస్క్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.  ప్రభుత్వంలో అనవసరపు ఖర్చులను తగ్గించే కార్యక్రమంలో తనకు అవకాశం కల్పించిన ట్రంప్ కు కృతజ్ణతలు చెబుతూనే.. తన రాజీనామా తరువాత కూడా డోజ్  మరింత పటిష్టంగా పనిచేసి లక్ష్యాలను చేరుకోవాలని మస్క్ ఆకాంక్షించారు.

అమెరికా అధ్యక్షుడిగా డోనాల్డ్ ట్రంప్ రెండో సారి అధికార పగ్గాలు అందుకున్న తరువాత ఆయన   ప్రభుత్వ విభాగాల్లో   వృథా ఖర్చులను అరికట్టడం  అనే లక్ష్యంతో డోజ్ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ డోజ్ కు ఎన్నికల ప్రచారంలో తనకు అన్ని విధాలుగా సహకరించిన ఎలాన్ మస్క్ ను చైర్మన్ గా నియమించిన సంగతి తెలిసిందే. ఇప్పుడా పదవికి ఎలాన్ మస్క్ రాజీనామా చేయడం డొనాల్డ్ ట్రంప్ కు బిగ్ షాక్ అనే చెప్పాలి. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu