అన్నాదీక్ష విరమణ..కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ప్రచారం
posted on Dec 28, 2011 3:44PM
ముంబై :
ఎన్నికలు జరిగే ఐదు రాష్ట్రాల్లో కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ప్రచారం చేస్తానని సామాజికవేత్త అన్నా హజారే పేర్కొన్నారు. వైద్యుల సూచన మేరకు తాను దీక్ష విరమిస్తున్నట్టు అన్నా ప్రకటించారు. పటిష్టమైన లోక్‌పాల్ బిల్లు తెచ్చే వరకు తాను ఉద్యమిస్తానని ఆయన స్పస్టం చేశారు. పటిష్టమైన జన్‌లోక్‌పాల్ బిల్లు తేవాలంటూ హజారే నిన్నటి నుంచి ముంబైలో నిరశన దీక్ష చేస్తున్న విషయం తెలిసిందే. ఆయన ఆరోగ్యం క్షీణించిందని, దీక్ష కొనసాగిస్తే కిడ్నీలు దెబ్బతినే అవకాశం ఉందని, తక్షణమే దీక్ష విరమించాలని వైద్యులు సూచించారు. దీంతో తన దీక్షను ఈరోజు విరమిస్తున్నట్టు అన్నా ప్రకటించారు. బలమైన లోక్‌పాల్ కోసం జైలుకెళ్లేందుకైనా సిద్ధం కావాలని మద్దతుదారులకు హజారే పిలుపునిచ్చారు. దీక్ష తర్వాత ఐదు రాష్ట్రాల ఎన్నికల ప్రచారంలో పాల్గొంటానని చెప్పారు.
అవినీతి నిర్మూలన ధ్యేయంగా, పటిష్టమైన లోక్‌పాల్ బిల్లు లక్ష్యంగా తన ఉద్యమం ఉంటుందని ఈ సందర్భంగా అన్నా తెలిపారు.