పోలీసులను ప్రశ్నించిన రేవంత్
posted on Dec 28, 2011 4:17PM
హైదరాబా
ద్: ఉస్మానియా విశ్వవిద్యాలయంలో న్యాయం కోసం ఉద్యమిస్తున్న విద్యార్థులు క్యాంపస్ దాటకుండానే కేసులు పెట్టిన పోలీసులు సిబిఐ కార్యాలయంపై దాడి చేసిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి అనుచరులపై జగన్ అనుచరులపై ఇప్పటి వరకు కేసు ఎందుకు పెట్టలేదని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. రాష్ట్రంలో ప్రజలకే కాదు మంత్రులకు, జైల్లో ఉన్న ఖైదీలకు కూడా రక్షణ లేకుండా పోయిందన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం డమ్మీ హోంమంత్రి ఉన్నారన్నారు.
గవర్నర్ నరసింహన్ శాంతిభద్రతలపై కేంద్రానికి తప్పుడు నివేదికలు పంపిస్తున్నారని ధ్వజమెత్తారు. సాక్ష్యాత్తూ మంత్రిపై దాడి జరిగితే ఖండించి ఊరుకున్నారన్నారు. రాష్ట్రంలో వరుస హత్యలు జరుగుతున్నా ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదన్నారు. పలు హత్యలకు నయీమ్ ముఠానే కారణమని తెలిసినప్పటికీ ప్రభుత్వం చర్యలెందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. ఆయన ముఠాకు ప్రభుత్వం ఏమైనా లైసెన్స్ ఇచ్చిందా అన్నారు.