'రాబోయే ఎన్నికల్లో కూడా విశాఖ నుండే'

హైదరాబాద్:  రాబోయే ఎన్నికల్లో కూడా తాను విశాఖపట్నం లోక్‌సభ నియోజకవర్గం నుండే పోటీ చేస్తానని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ సహాయ మంత్రి దగ్గుపాటి పురంధేశ్వరి ఓ ఛానల్ ముఖాముఖి చర్చలో చెప్పారు.తనకు నియోజకవర్గం మారే ఆలోచన లేనేలేదని అన్నారు. తనకు ఎవరితో విభేదాలు లేవని, అసలు తాను వివాదాలకు దూరమని చెప్పారు. తాను ఇక్కడ స్థానికేతరురాలినని విపక్షాలు ప్రచారం చేసినా ప్రజాభిమానంతో గెలిచానని, 2014 ఎన్నికల్లో కూడా మళ్లీ ఇక్కడి నుండే పోటీ చేస్తానని చాలాసార్లు ఇప్పటికే చెప్పానని మళ్లీ అదే చెబుతున్నానని అన్నారు.కాగా ఇటీవల రాజ్యసభ సభ్యుడు టి.సుబ్బిరామి రెడ్డి తాను వచ్చే ఎన్నికల్లో విశాఖ నుంచి పోటీ చేస్తానని ఆమె నరసారావు పేట లేదా బాపట్ల నియోజకవర్గాల్లో ఏదో ఒక చోటు నుంచి పోటీ చేయవచ్చునని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.
 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu