గాలికి కన్నడ మంత్రి ఆసరా
posted on Dec 28, 2011 12:26PM
హైదరా
బాద్: ఓఎంసి కేసులో అరెస్టై చంచల్‌గూడ జైల్లో ఉన్న కర్నాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డిని కావాలని కొన్ని శక్తులు కుట్ర పన్ని ఇరికించాయని కర్నాటక మంత్రి ఆనంద్ అస్నోటికర్ ఆరోపించారు. చంచల్‌గూడ జైల్లో ఉన్న గాలిని ఆయన పరామర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడారు.ఆయన తనకు పెద్దన్నలాంటి వాడని, అందుకే వ్యక్తిగతంగా జైల్లో కలిసి పరామర్శించినట్లు చెప్పారు. గాలి త్వరలో నిర్దోషిగా బయటకు వస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.కాగా ఓబుళాపురం అక్రమ మైనింగ్ కేసులో నిందితురాలు శ్రీలక్ష్మి పాత్రపై త్వరలో నేరాభియోగ పత్రాన్ని దాఖలు చేయనున్నట్లు సిబిఐ మంగళవారం న్యూఢిల్లీలో వెల్లడించింది. నేరాభియోగ పత్రం దాఖలు చేయనున్నప్పటికీ ఎప్పుడు దాఖలు చేసేది చెప్పలేమన్నారు.