టీఆర్ఎస్ ఎంపీ నామాకు ఈడీ షాక్.. 96.21 కోట్ల ఆస్తులు జప్తు

తెలంగాణ రాష్ట్ర సమితి ఎంపీ నామానాగేశ్వరరావుకు ఈడీ షాక్ ఇచ్చింది. ఆయనకు చెందిన మధుకాన్ గ్రూప్ కంపెనీలకు చెందిన ఆస్తులను జప్తు చేసింది. దాదాపు 96.21 కోట్ల రూపాయల విలువైన ఆస్తులను ఈడీ సోమవారం (అక్టోబర్ 17) జప్తు చేసింది.

నామానాగేశ్వరరావు, నామా సీతయ్యల అధీనంలో ఉన్న ఈ ఆస్తులను ఈడీ జప్తు చేసింద. రాంచీ-జంషడ్ పూర్ హైవే నిర్మాణం పేరిట బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను మధుకాన్ గ్రూప్ కంపెనీ దారి మళ్లించిందన్న అభియోగాలపై ఈడీ దర్యాప్తు చేపట్టిన సంగతి విదితమే.

ఈడీ దర్యాప్తులో డొల్ల కంపెనీల ద్వారా ఈ నిధుల మళ్లింపు జరిగినట్లు గుర్తించింది.   దీంతో హైదరాబాద్, బెంగాల్, విశాఖ, ప్రకాశం జిల్లాల్లో ఈ కంపెనీ పేరున ఉన్న 88.85 కోట్ల విలువైన భూములు, అలాగే 7.36 లక్షల విలువైన చరాస్థులను ఈడీ జప్తు చేసింది.  కాగా ఇదే కేసులు సంబంధించి గత ఏడాది జూన్ లో నామా నాగేశ్వరరావు నివాసంలో ఈడీ సోదాలు నిర్వహించిన సంగతి విదితమే.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu
Related Segment News