జ‌గ‌న్ అడ్డుకోలు ఆట‌!

హీరోయిన్‌ని తీసికెళుతోన్న హీరోగారు, ఆయ‌న స్నేహ‌బృందాన్ని విల‌న్ అడ్డుకోవ‌డానికి అనేక మార్గాల్లో అడ్డంకులు క‌ల్పించ‌డం, ఒక‌టి రెండు దాడులు చేయుట‌..తీరిగ్గా త‌న్నులు తిని సుఖంగా హీరోహీరోయి న్లు వెళ్ల‌డానికి అడ్డంకులు తొల‌గించేయ‌డం..ఇదంతా సినీసీన్లు. కానీ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో రైతుల పాద‌ యాత్ర ఎక్క‌డిక‌క్క‌డ నిలువ‌రించే య‌త్నం చేయ‌డం, యాత్ర‌కు మ‌ద్ద‌తుగా విప‌క్షాల మ‌ద్ద‌తును అడ్డుకోవ‌డానికి ప్ర‌భుత్వం  పోలీసుల‌తో అడ్డంకులు సృష్టిం చ‌డం, క‌ద‌ల‌నీయ‌కుండా చేసి వారితో వ‌చ్చి న వారిపై దాడులు చేయించి మ‌రీ భ‌య‌పెట్ట‌డం లాంటివి ఈమ‌ధ్య జ‌గ‌న్ స‌ర్కారుకి దిన‌చ‌ర్య‌గా మారింది. ఎవ‌ర‌న్నా ప్ర‌జోపయోగ ప‌నుల్లో బిజీగా ఉంటారు. కానీ జ‌గ‌న్ స‌ర్కార్ మాత్రం విప‌క్షాల‌వారు వీధి చివ రికి వెళుతు న్నార‌ని తెలిసినా ఒక్క‌రిద్ద‌రు పోలీసుల‌నైనా పంపి వెన‌క్కి పంపే య‌త్నాలే చేస్తున్నారు. ఇది  పిరికి త‌నంతో కూడిన భ‌య‌మ‌నే అనుకోవాలి.  ప్ర‌జ‌ల్లో ఆద‌ర‌ణ కోల్పోయిన మ‌న‌స్తాపం ఈవిధంగా తీర్చుకుంటున్నార‌నే అనుకోవాలి. ఎందుకంటే మ‌హాపాద‌ యాత్ర చేస్తున్న రైతాంగానికి మద్ద‌తునివ్వ‌డానికి టీడీపీ యువ‌నాయ‌కులు ప‌రిటాల శ్రీ‌రామ్(అనంత‌ పురం), వంగ‌వీటి రాధా(విజ‌ య‌వాడ‌), గంటీ హ‌రీష్ (అమ‌లా పురం) వంటివారు ఆదివార‌మే రాజ‌మండ్రి చేరుకున్నారు. కాగా సోమ‌వారం ఉద‌యం పాద యాత్ర‌లో పాల్గొన‌డానికి బ‌య‌టికి  రాగానే వీరితో పాటు టీవీ5 చైర్మ‌న్ బీ.ఆర్‌.నాయుడిని కూడా పోలీసులు ఊహించ ని విధంగా చుట్టుముట్టి అడుగు ముందుకు వేయ‌ నీయ‌లేదు. 

ఉమ్మ‌డి తూర్పుగోదావ‌రి జిల్లాలో రైతుల మ‌హాపాద‌యాత్ర రాజ‌మండ్రికి చేరుకోవ‌డాన్ని ప్రభుత్వం అడ్డు కునే య‌త్నాలు ముమ్మ‌రం చేసింది. ప్ర‌శాంతంగా పాద‌యాత్ర చేస్తున్న రైతాంగాన్ని నిలువ‌రిం చేందు కు రాజ‌మండ్రి రోడ్డు క‌మ్ రైలు బ్రిడ్జి మీద రాక‌పోక‌లు నిషేధించారు. రిపేరు పేరుతో వారం రోజులు తిర‌గ రాద‌ని నిషేధా జ్ఞ‌లు అమ‌లుచేస్తున్నారు. అయినా త‌మ పాద‌యాత్ర ఆగే ప్ర‌సక్తి లేద‌ని రైత‌లు అంత‌కు మించి ధీటుగా స‌మాధానం ఇచ్చారు. వారికి సంఘీభావం తెలియ‌జేస్తూ పాద‌యాత్ర‌లో అడుగు క‌లిపేం దుకు, వారిని ఉత్సాహ‌ప‌రిచేందుకు టిడిపీ నాయ‌కులు రాజ‌మండ్రి చేరుకున్నారు. కానీ వారిని పోలీసులు అడ్డుకుని అడుగు ముందుకు వేయ‌నీయ‌క‌పోవ‌డంతో అక్క‌డ ఉద్రిక్త‌త చోటు చేసుకుంది. 

పాదయాత్రకు వెళ్లడానికి వీల్లేదని పోలీసులు ఆంక్షలు విధించారు. ఈ క్ర‌మంలో పోలీసుల  అడ్డును త‌ప్పించుకుని ముందుకు సాగేందుకు ప్ర‌య‌త్నించిన బీఆర్ నాయుడు కారుకు అడ్డుగా నిలిచిన పోలీ సులు అరెస్టులు త‌ప్ప‌వ‌ని హెచ్చ‌రించారు. టీడీపీ నాయ‌కుడు కోనేరు మురళి ఇంటి వ‌ద్ద నుంచి బ‌య లు దేరిన వంగ‌వీటి రాధాను కూడా అడ్డుకున్నారు. దీంతో స్థానిక టీడీపీ కార్య‌క‌ర్త‌లు సైతం.. భారీ ఎత్తున అక్కడకు చేరుకున్నారు. దీంతో కోనేరు మురళి నివాసానికి భారీగా చేరుకున్న పోలీసులు త‌మ‌కు స‌హ‌క రించి వెళ్లిపోవాల‌ని లేకుంటే  అరెస్టులు త‌ప్ప‌వ‌ని హెచ్చ‌రించారు. దీంతో రాజ‌మండ్రి రాజ‌కీయం ఒక్క సారిగా వేడెక్కింది. 

ప్ర‌జానిర‌స‌న‌ను అడ్డుకోవ‌డానికి ప్ర‌భుత్వం విశ్వ‌య‌త్నాలు చేస్తోందే గాని, ప్ర‌జ‌ల నిర‌స‌న‌కు కార‌ణ‌మైన పాల‌నా విధానాల్లో మార్పులు చేర్పుల‌కు మాత్రం స‌సెమిరా అంగీక‌రించ‌డం లేదు. మూడేళ్లపాల‌న‌లో ప్ర‌జాహితంగా చేస్తున్నామ‌ని ప్ర‌చారం చేసుకున్న ఏ ఒక్క కార్య‌క్ర‌మం ప్ర‌జ‌ల‌ను ఆక‌ట్టుకోలేదు. పైగా తీవ్ర నిర‌స‌న వెల్లువెత్తుతోంది. దీన్ని భ‌రించ‌లేక‌నే జ‌గ‌న్ స‌ర్కార్   రైతుల మ‌హాపాద‌యాత్ర‌ను నిలువ‌ రించడంలో విప‌క్షాలమీద దుమ్మెత్తిపోయ‌డం, వారిని మాట్లాడ‌నీయ‌కుండా చేయ‌డం, అడ్డుకోవ‌ డం, అరెస్టుల భ‌య‌పెట్ట‌డాలు చేయ‌డం విప‌క్ష‌పార్టీల కార్య‌క‌ర్త‌లపై లాఠీ ఝుళిపించి అరెస్టులు చేయ‌డా ల‌కు పూనుకుం టోంది. 

అమ‌రావ‌తి రాజ‌ధానిని చేయ‌కుండా మూడు రాజ‌ధానుల అంశాన్ని తెర‌మీద‌కి తేవ‌డంతోనే విప‌క్షాలు మండిప‌డ్డాయి. ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా అమ‌రావ‌తి రైతులు చేప‌ట్టిన పాద‌యాత్ర కు టీడీపీ తో పాటు విప‌క్షాల‌న్నీ మ‌ద్ద‌తు నీయ‌డంతో అది మ‌రింత ఊపందుకుంది. దానికి కౌంట‌ర్‌గా డైవ‌ర్ష‌న్ పాలిటిక్స్‌కు వైసీపీ తెర‌లేపింది. అది గాలివాన‌గా మారింది. హైకోర్టులో తీర్పుపై అస్పీలు చేసి స‌రిపెట్టుకోవ‌ల‌సి  వ చ్చింది. 

కానీ అమ‌రావ‌తి రైతులు మాత్రం పాద‌యాత్ర‌ను మహాపాద యాత్ర‌గా మార్చి క‌దం తొక్కారు. వారికి సంఘీ భావం ప్ర‌క‌టించిన టీడీపీ, కాంగ్రెస్ పార్టీల‌తో పాటు ప‌వ‌న్ క‌ళ్యాణ్ జ‌న‌సేన పార్టీ కూడా  గ‌ట్టి మ‌ద్ద‌తే ఇ చ్చింది. ఈ నేప థ్యంలో వారి మ‌ద్ద‌తు యాత్ర‌ను కూడా  జ‌గ‌న్ సర్కార్ తీవ్రంగా అడ్డుకుంది. జ‌న‌సేన అధినేత ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ తో పాటు ఆయ‌న పార్టీ నాయ కులు, అభిమానుల‌ను తిరిగి వెళిపోవాల ని పోలీసుల‌తోనే ప్ర‌తిఘ‌టించేలా చేసి దాడుల‌కు పాల్ప‌డ్డారు. ప‌వ‌న్ బ‌స చేసిన హోట‌ల్‌కి వెళ్లి మ‌రీ అక్క‌డ ఉన్న ఇత‌ర జ‌న‌సేన నాయ‌కుల‌ను బ‌య‌టికి తీసుకు వ‌చ్చి మీకు అనుమ‌తి లేద‌ని అంటూ వారి ని వెన‌క్కి పంపిం చ డం జ‌గ‌న్ స‌ర్కార్ ప‌రిస్థితిని స్ప‌ష్టం చేస్తుంది.  జ‌గ‌న్‌కి తిండి తినే కంటే విప‌క్షాలను క‌ద‌ల‌కుండా ఎలాచేయాల‌న్న ఆలోచ‌నే ఎక్కువ యిం ద‌న డానికి ఈ సంఘ‌ట‌న‌లే నిద‌ర్శ‌నం. 

స‌రిగా చ‌ద‌వ‌కుంటే పిల్ల‌ల్ని తండ్రి తిడ‌తాడు, ఆడ‌కుంటే కోచ్ తిడ‌తాడు, స‌రిగా పాల‌న చేయ‌కుంటే ప్ర‌జలు తిర‌గ‌బ‌డ‌తారు. కాదు పొమ్మంటే విప‌క్షాలు ఛ‌స్తే ఊరుకోవు. ప్ర‌తిఘ‌టిస్తాయి, ఉద్య‌మిస్తాయి కాద‌ని అడ్డుకునే వ్యూహాలు ఎన్ని పారించే య‌త్నాలు చేసినా ఫ‌లితం శూన్య‌మే. జ‌గ‌న్ ఎంత ఆలోచిం చినా అడ్డు కోవ‌డాలు, పోలీసుల మ‌ద్ద‌తుతో ప్ర‌భుత్వం ప్ర‌జాభీష్టంగా ముంద‌డుగు వేయ‌డం దుర్ల‌భం.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu
Related Segment News