అయ్యయ్యో... రోజా ఏమిటిది? ఇదేం సంస్కారం!?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి   రోజా.. వ్యవహార శైలి పట్ల ప్రజలే కాదు.. ఆమె సొంత పార్టీలోని కీలక నేతల నుంచి క్యాడర్ వరకు అంతా... అయ్యయ్యో ఇదేంటి.. ఇలా చేస్తోందేంటి... అంటూ ముక్కన వేలేసుకొంటున్నారు.   మూడు రాజధానులకు మద్దతుగా విశాఖపట్నంలో  వైసీపీ ఆధ్వర్యంలో శనివారం జరిగిన విశాఖ గర్జనలో మంత్రులు, పలువురు కీలక నేతలు ప్రసంచిన సంగతి తెలిసిందే. గర్జన అనంతరం  రోజాతోపాటు పలువురు కీలక నేతలు తిరుగు ప్రయాణం కోసం విశాఖ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు.

ఆ సమయంలో ఎయిర్ పోర్ట్ వద్ద   రోజా   చేష్టల పట్ల.. ఎయిర్ పోర్టు సిబ్బందే కాదు.. ఆ పరిసర ప్రాంతాల్లోని ప్రజలంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు.  మంత్రి ఆర్కే రోజా వెకిలి చేష్టలకు సంబంధించిన  ఓ వీడియో సామాజిక మాధ్యమంలో  హల్‌చల్ చేస్తోంది. మంత్రి రోజా ఏమిటీ.. ఇలా చేయడం ఏమిటి.. బూతూ... బూతూ అంటూ ఓ వైపు,   రోజా అడ్డంగా దొరికిపోయిందంటూ మరోవైపు నెటిజన్లు విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు.

విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌గా ఉండాలంటూ ఇటీవల అధికార ఫ్యాన్ పార్టీ నేతలు విశాఖ గర్జన పేరిట భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభ ముగించుకొని.. మంత్రులు, పలువురు కీలక నేతలు విశాఖ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. అయితే అదే రోజు.. విశాఖలో జనవాణి కార్యక్రమం కోసం జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్.. విశాఖకు చేరుకొన్నున్నారు. ఆ క్రమంలో ఎయిర్ పోర్టు పరిసర ప్రాంతాలు జనసైనికులు, పవన్ కల్యాణ్‌ ఫ్యాన్‌తో నిండిపోయింది. దీంతో ఎయిర్ పోర్ట్ పరిసర ప్రాంతాలు  ఉద్రిక్తంగా మారాయి.  పవన్‌కు అనుకూలంగా.. జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వారంత పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఆ సందర్భంగా.. పర్యాటక శాఖ మంత్రి   రోజా  వేలు ఎత్తి చూపించడం పట్ల.. సొంత పార్టీలోని వారే అసహ్యించుకోవడం గమనార్హం.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu