కాంగ్రెస్ కు షాకిచ్చిన తోట గోపి
posted on Mar 26, 2012 5:10PM
పశ్చిమగోదావరిజిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో తోట గోపి ముఖ్యమైన వ్యక్తి. అనేక సంవత్సరాలుగా పార్టీకి సేవలందించిన తోట గోపి ఇప్పుడు ఆ పార్టీకి షాకిచ్చారు. తన అనుచరులతో కలిసి త్వరలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరాలని ఆయన నిర్ణయించుకున్నారు. దీంతో ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ పెద్ద దిక్కును కోల్పోయినట్లవుతుంది. మార్కెట్ కమిటి మాజీ చైర్మన్ గా పనిచేసిన తోట గోపి గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ కోసం ప్రయత్నించి విఫలమయ్యారు. 2014 ఎన్నికల్లో ఆయనకు టిక్కెట్ వచ్చే అవకాశం ఉన్నప్పటికీ ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ బాగా బలహీనపడింది. దీంతో ఆయన ఏప్రిల్ నాలుగో తేదీన జగన్ సమక్షంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. వచ్చేనెల 30 న వేలాదిమంది కార్యకర్తలు, అభిమానులతో బలహింగ సభ కూడా నిర్వహించాలని ఆయన ప్రణాళికలు సిద్ధంచేశారు.