రష్యాలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ

రష్యాలో భారీ భూకంపం సంభ‌వించింది. రిక్టర్ స్కేలుపై ఈ భూకంప తీవ్రత 8.7గా నమోదైంది. 2011 టోకియో భూకంపం తరువాత ఇదే అతి పెద్ద భూకంపంగా అధికారులు చెబుతున్నారు. రష్యాలోని తూర్పు ప్రాంతమైన కమ్చట్కా ద్వీపం సమీపంలో  ఈ భారీ భూకంపం సంభవించింది. ఈ భారీ భూకంపం కారణంగా రష్యా, జపాన్ తీరప్రాంతాలతో పాటు పసిఫిక్ మహాసముద్రానికి ఆనుకుని ఉన్న అనేక దీవులకు సునామీ ముప్పు ఉందని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

 భూకంపం ప్రభావంతో సముద్రంలో పెద్ద అలలు ఏర్పడే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. అమెరికా హవాయి, అలస్కా, గువామ్ దీవులకూ సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి.  సైపాన్, రోటా, టినియన్ వంటి సమీప దీవులకు కూడా ముందస్తు అప్రమత్తం జారీ చేశారు. ఇలా  ఉండగా   జపాన్ ఉత్తర ప్రాంతానికి 250 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు. ఈ కారణంగా జపాన్ పసిఫిక్ తీర ప్రాంతాలకు సునామీ ముప్పు అధికంగా ఉంటుందని జపాన్ వాతావరణ సంస్థ హెచ్చరించింది.  

Online Jyotish
Tone Academy
KidsOne Telugu