అసోంలో కంపించిన భూమి.. త్రిపుర, మేఘాలయలో కూడా

అస్సాంలో  సోమవారం (జవవరి 5) తెల్లవారు జామున భూమి కంపించింది. రిక్కర్ స్కేలుపై ఈ భూకంప తీవ్రత 5.1గా నమోదైంది. అస్సాంలోని మోరిగావ్ ప్రాంతంలో భూమికి 50 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు తెలిపారు.

 ఈ భూకంప ప్రభావంతో త్రిపురలో కూడా పలు ప్రాంతాలలో భూ ప్రకంపనలు సంభవించాయి. అయితే ఈ భూకంప తీవ్రత అసోంతో పోలిస్తే త్రిపురలో చాలా స్వల్పంగా ఉంది. త్రిపురలో భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.9గా నమోదైంది. ఇక పోతే మేఘాలయలోని పలు ప్రాంతాలలో కూడా భూమి స్వల్పంగా కంపించింది. ఆలా ఉండగా ఈ భూకంపం కారణంగా ఎక్కడా ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరిగినట్లు సమాచారం లేదు.  

Online Jyotish
Tone Academy
KidsOne Telugu